రాష్ట్రంలో అరాచక పాలన

ABN , First Publish Date - 2022-05-14T06:11:51+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, దానిపై ప్రజలు విస్మయం చెందుతున్నారని జనసేన అరకులోయ పార్లమెంట్‌ కన్వీనర్‌ వంపూరు గంగులయ్య అన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన
జనసేనలో చేరిన వారితో పార్టీ కన్వీనర్‌ గంగులయ్య

 

జనసేన అరకు పార్లమెంట్‌ కన్వీనర్‌ గంగులయ్య

పాడేరు, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, దానిపై ప్రజలు విస్మయం చెందుతున్నారని జనసేన అరకులోయ పార్లమెంట్‌ కన్వీనర్‌ వంపూరు గంగులయ్య అన్నారు. మండలంలో బరిసింగి పంచాయతీ గడివలసలో శుక్రవారం నిర్వహించిన జనసేన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారన్నారు. సామాన్యులు సైతం బతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. యువత ఈ ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నదని గంగులయ్య అన్నారు. ఈ సందర్భంగా గడివలస, కొత్తూరు, బూరుగుపుట్టు గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులు జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీలు నేతలు పాంగి సురేశ్‌, సాలేబు అశోక్‌, మజ్జి సత్యనారాయణ, సంతోశ్‌, కిల్లో అశోక్‌ పాల్గొన్నారు. 


Read more