ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

‘పది’ మూల్యాంకనంలో రసాభాస

ABN, First Publish Date - 2022-05-14T05:59:23+05:30

పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం రోజు శుక్రవారం రసాభాసగా మారింది.

ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతున్న పరిశీలకుడు సుబ్బారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

టీచర్లు, సంఘ నేతలపై నోరుజారిన ఉన్నతాధికారి

గైర్హాజరైన 160 మంది టీచర్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం

సంఘాల ఆందోళనతో నిర్ణయం ఉపసంహరణ

విశాఖపట్నం, మే 13(ఆంధ్రజ్యోతి): పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం రోజు శుక్రవారం రసాభాసగా మారింది. మూల్యాంకనానికి హాజరుకాని టీచర్ల విషయంలో ఒక ఉన్నతాధికారి నోరుజారిన మాటలు, ఉపాధ్యాయ సంఘ నేతలతో పరుషంగా మాట్లాడం వివాదాస్పదమైంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి నగరంలో క్వీన్‌మేరీస్‌ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి మూల్యాంకనం ప్రారంభమైంది. అయితే మూల్యాంకనానికి 160 మంది టీచర్లు వివిధ కారణాలతో హాజరు కాలేదు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు, గర్భిణులు, బాలింతలు, ఇళ్లల్లో వివాహాలు ఉన్న వారు రాలేదు. అయితే మరికొందరు టీచర్లు మూల్యాంకనం విధుల కోసం అక్కడకు వచ్చారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు జిల్లా విద్యాశాఖాఽధికారి చంద్రకళను కలిసి విన్నవించగా, ఆమె అంగీకరించలేదు. విధులకు హాజరుకాని టీచర్లకు షోకాజ్‌ ఇస్తామని తేల్చిచెప్పారు. ఇదిలావుండగా మూల్యాంకనానికి పాఠశాల విద్యాశాఖ నుంచి పరిశీలకుడిగా హాజరైన మధ్యాహ్న భోజనం పథకం డైరెక్టర్‌ సుబ్బారెడ్డి టీచర్లు, సంఘ నేతల పట్ల పరుషంగా మాట్లాడారు. ‘మూల్యాంకనం విధులు ఇష్టం లేకపోతే పాఠశాల స్థాయిలోనే రిలీవ్‌ కాకుండా ఉండిపోవాల్సింది కదా....... టీచర్‌ పోస్టులు ఇష్టం లేకపోతే మరో ఉద్యోగానికి వెళ్లిపోవాలి కదా?’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో సంఘ నేతలపై నోరు పారేసుకున్నారు. కొత్తగా మూల్యాంకనం విధులకు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్న టీచర్ల జాబితాతో సంఘ నేత ఒకరు వెళ్లగా అతనిపై ఒంటికాలుపై లేచి దుర్భాషలాడారు. కాగా మూల్యాంకనానికి హాజరుకాని టీచర్లకు షోకాజ్‌లు జారీచేసే విషయం బయటకు తెలియడంతో సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పరిశీలకుడు సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా టీచర్లు, సంఘాల నేతలు నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. షోకాజ్‌లు వెనక్కి తీసుకోకపోతే శనివారం నుంచి మూల్యాంకనం విధులు బహిష్కరిస్తామని సంఘాల నేతలు హెచ్చరించారు. చివరకు సుబ్బారెడ్డి, డీఈవో చంద్రకళలు మెట్టు దిగి సంఘ నేతలతో చర్చించారు. షోకాజ్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  చిన్నబ్బాయి(యూటీఎఫ్‌), పైడిరాజు, దేముడుబాబు, రామిరెడ్డి(ఎస్‌టీయూ) గోపినాథ్‌( పీఆర్‌టీయూ), కోటాన శ్రీనివాసరావు(ఏపీటీఎఫ్‌), రామకృష్ణ(పండిట్‌ పరిషత్‌), సుధాకర్‌(ఎస్టీ, ఎస్టీ టీచర్స్‌ సంఘం)లు ఆందోళనలో పాల్గొన్నారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!