-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » 1133 crore assistance to fishermen in the district-NGTS-AndhraPradesh
-
జిల్లాలో మత్స్యకారులకు రూ.11.33 కోట్ల సాయం
ABN , First Publish Date - 2022-05-14T05:40:30+05:30 IST
జిల్లాలోని మత్స్యకారులకు ‘మత్స్యకార భరోసా’ పథకం కింద 11 కోట్ల 33 లక్షల 40 వేలు అందించినట్లు జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు.
కలెక్టర్ మల్లికార్జున వెల్లడి
విశాఖపట్నం, మే 13: జిల్లాలోని మత్స్యకారులకు ‘మత్స్యకార భరోసా’ పథకం కింద 11 కోట్ల 33 లక్షల 40 వేలు అందించినట్లు జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. నాలుగో విడత సాయం అందించిన సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కోనసీమ నుంచి శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్‌గా కలెక్టర్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా లబ్ధిదారులకు కలెక్టర్ సాయం చెక్కు అందజేశారు.
ఒక్కో కుటుంబం ఖాతాలో రూ.10 వేలు జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్‌కుమార్, తిప్పలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, వరుడు కల్యాణి, ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ గోవిందరావు, డైరెక్టర్ విజయచంద్ర పాల్గొన్నారు.

