ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో Nakka Anand babu పర్యటన

ABN, First Publish Date - 2022-05-10T17:10:14+05:30

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో మాజీ మంత్రి నక్క ఆనంద బాబు మంగళవారం ఉదయం పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

గుంటూరు: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో మాజీ మంత్రి నక్క ఆనంద బాబు(Nakka Anand Babu) మంగళవారం ఉదయం పర్యటించారు. వేమూరు నియోజకవర్గం లోని లంక గ్రామాలలో పొలాల పరిశీలించారు. ఈదురు గాలులతో అరటి, బొప్పాయి, తమలపాకు తోటలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో బాధిత రైతులతో మాట్లాడిన ఆనంద బాబు పంట నష్టంపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో 2 వేల ఎకరాలలో అరటి పంట నాశనం అయిందన్నారు. లంక గ్రామాల రైతులకు నోటికాడికి వచ్చిన పంట నేల పాలు అయిందని తెలిపారు.


లంక గ్రామాల రైతులకు ప్రతి సారి ఏదో రూపంలో దెబ్బ తగులుతోందన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో మాటలకే పరిమితం అవుతోందని విమర్శించారు. ఈదురు గాలులతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని నక్కా ఆనంద బాబు స్పష్టం చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!