ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నారాయణ అరెస్ట్ వెనుక జగన్ కుట్ర: budda venkanna

ABN, First Publish Date - 2022-05-10T19:17:18+05:30

మాజీ మంత్రి నారాయణ(Narayana)అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత బుద్దా వెంకన్న(Budda venkanna) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

విజయవాడ: మాజీ మంత్రి నారాయణ(Narayana)అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత బుద్దా వెంకన్న(Budda venkanna) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నారాయణ అరెస్టు వెనుక జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. మొన్న ఉపాధ్యాయుల ఆందోళనలో జగన్ తీరుపై టీచర్లు ధ్వజమెత్తారని... అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) వారిపై కక్ష కట్టారన్నారు. పదో తరగతి పేపర్‌ను ప్రభుత్వ పెద్దలే లీక్ చేశారని అన్నారు. ఇప్పుడు కొంతమంది టీచర్‌లను టార్గెట్ చేసి కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. నారాయణను కూడా ఈ కేసులో ఇరికించారన్నారు. ప్రభుత్వంపై పడిన మచ్చను చెరిపేయాలని మాజీ మంత్రిగా నారాయణను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు భయపడవద్దని.. తాడోపేడో తేల్చుకుందామని తెలిపారు. నారాయణ అక్రమ అరెస్ట్‌పై పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని టీపీపీ శ్రేణులకు బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!