ఉత్తరకోస్తాపై ఉపరితల ఆవర్తనం

ABN , First Publish Date - 2022-05-14T09:02:36+05:30 IST

ఉత్తరకోస్తాపై ఉపరితల ఆవర్తనం

ఉత్తరకోస్తాపై ఉపరితల ఆవర్తనం

విశాఖపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): ఉత్తరకోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హిందూ మహాసముద్రం నుంచి రుతుపవన మేఘాలు రావడంతో నైరుతి బంగాళాఖాతంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. రానున్న రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు. 

Read more