ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సచివాలయాల్లో ‘మీసేవ’లను విస్తృతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-14T05:27:30+05:30

గ్రామ సచివాలయాల్లోని మీసేవ కేంద్రాల ద్వారా సేవలను విస్తృతం చేయాలని జడ్పీ సీఈవో బెందాళం లక్ష్మీపతి ఆదేశించారు. శుక్రవారం నందిగాం గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు.

మాట్లాడుతున్న జడ్పీ సీఈవో బెందాళం లక్ష్మీపతి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750


 జడ్పీ సీఈవో లక్ష్మీపతి

నందిగాం: గ్రామ సచివాలయాల్లోని మీసేవ కేంద్రాల ద్వారా సేవలను విస్తృతం చేయాలని జడ్పీ సీఈవో బెందాళం లక్ష్మీపతి ఆదేశించారు. శుక్రవారం నందిగాం గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. మీసేవ ద్వారా అందిస్తున్న సేవల ను పరిశీలించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వినియోగించుకునేలా చూడాలన్నారు.  అనంతరం నరేంద్రపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న చెత్తసేకరణ కేంద్రాన్ని హైకోర్టు తీర్పు నేపథ్యంలో వేరే ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కె.ఫణీంద్ర కుమార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కార్యదర్శులు పి.ఆనందరావు, ఎ.ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.


123 ఆధార్‌ కేంద్రాల ఏర్పాటు 

పోలాకి: సచివాలయాల ద్వారా మరింత సేవలు అందిం చేందుకు జిల్లాలో 123 ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తునట్లు జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలిపారు. శుక్ర వారం ఎంపీడీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రేషన్‌ కార్డులు, ఉపాధి జాబ్‌ కార్డులు, ఫించన్‌దారుల ఈకేవైసీ, ప్రింట్‌ ఫింగర్‌ తదితర సమస్యల ను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. పోలాకి మండల నోడల్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టానని 31 పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. ఎంపీడీవో ఎం.ఈశ్వరరావు ఉన్నారు.


షెడ్ల నిర్మాణం వేగవంతం చేయండి

వజ్రపుకొత్తూరు: ప్రతి పంచాయతీలో చెత్తసేకరణ షెడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో బెందాళం లక్ష్మీ పతి ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ కార్య దర్శులతో సమీక్షించారు. చెత్తసేకరణ షెడ్ల నిర్మాణంలో మండలం ఎంతో వెనుకబడి ఉందన్నారు. మండ లంలో రెండు మోడల్‌ షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాల న్నారు. గ్రామాల్లో చెత్తను బయట పార బోయకుండా అవగా హన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో ఈశ్వరమ్మ, ఈవోపీఆర్డీ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!