మహిళలపై అత్యాచారాలు అన్యాయం
ABN, First Publish Date - 2022-05-06T05:24:37+05:30
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరగడం అన్యాయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
ధర్నా చేస్తున్న బీజేపీ మహిళా మోర్చా నాయకులు
కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకుల ధర్నా
కలెక్టరేట్: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరగడం అన్యాయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎం.విజయసునీతకు వినతిపత్రం అందించారు. జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిలు ఎం.లక్ష్మిరెడ్డి, పి.శ్రీదేవి, ఉపాధ్యక్షులు రౌతు రూపవతి, కార్యదర్శి గిరిజరాని, నాయకులు పాల్గొన్నారు.