నవాబుపేటలో విషాదం

ABN , First Publish Date - 2022-05-14T06:16:54+05:30 IST

నవాబుపేటలో విషాదం

నవాబుపేటలో విషాదం
ఎస్సై ఇంటి వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

సర్పవరం స్టేషన్‌ ఎస్సై ఆత్మహత్యతో కలవరం

పెనుగంచిప్రోలు, మే 13 : కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం స్టేషన్‌ ఎస్సై ముత్తవరపు గోపాలకృష్ణ మృతితో ఆయన స్వగ్రామం నవాబుపేటలో శుక్రవారం విషాదఛాయలు అలముకొన్నాయి. శుక్రవారం ఉదయం ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు రావడంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సరోజని కన్నీటిపర్యంతమయ్యారు. గోపాలకృష్ణకు తెలంగాణలోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామానికి చెందిన పావనితో 2018లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల పాప భవిష్య, ఏడాదిన్నర బాబు శర్వాన్‌ ఉన్నారు. గోపాలకృష్ణ 2013లో ఆరు నెలలు వీఆర్వోగా ఇదే మండలంలోని అనిగండ్లపాడులో పనిచేస్తూ 2014లో ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన పదో తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్నారు. ఇంటర్‌, డిగ్రీ నందిగామలోని చైతన్య కళాశాలలో చదివారు. ఎంతో సౌమ్యుడిగా, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పాఠశాలలో చదివి బాధ్యత కలిగిన పోలీస్‌ అధికారిగా మంచిపేరు సాధించిన గోపాలకృష్ణ అనతికాలంలోనే మృతిచెందడంపై విశ్వవాణి విద్యాలయం కరస్పాండెంట్‌, కేడీసీఎంఎస్‌ డైరెక్టర్‌ గింజుపల్లి రవికుమార్‌ దిగ్ర్భాంతి చెందారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 



Read more