శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా మీనాక్షి
ABN, First Publish Date - 2022-05-07T06:17:03+05:30
శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా మీనాక్షి
డీఎంహెచ్‌వోగా మీనాక్షి
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 6: జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిగా బొడ్డేపల్లి మీనాక్షి నియమితులయ్యారు. ఈమె గతంలో జిల్లాలో డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేశారు. ప్రస్తుతం కాకినాడ అడిషనల్ డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడే పూర్తి అదనపు బాధ్యత లతో (ఎఫ్‌ఏసీ) డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్నారు. అక్కడ నుంచి బదిలీపై శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా వస్తు న్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆర్‌ఎంవో హేమంత్ కుమార్‌ను అనకాపల్లి డీఎంహెచ్‌వోగా బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీచేశారు.