-
-
Home » Andhra Pradesh » Scissors Suresh abroad-NGTS-AndhraPradesh
-
విదేశాల్లో కత్తెర సురేశ్..!
ABN , First Publish Date - 2022-05-14T08:26:30+05:30 IST
విదేశాల్లో కత్తెర సురేశ్..!
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛంద సంస్థల ముసుగులో విదేశీ నిధుల దుర్వినియోగం కేసులో విజయవాడలో ఇప్పటి వరకూ ఎవ్వరినీ అరెస్టు చేయలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంలో 40 మందిపై కేసు నమోదుచేసి సుమారు 17మందిని అరెస్టు చేసింది. గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్ క్రిస్టినా భర్త కత్తెర సురేశ్‌పైనా కేసు నమోదైంది. ఆయనను అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన సీబీఐ... తాము అరెస్టు చేసిన వారిలో సురేశ్ లేడని తెలిపింది. విశ్వసనీయ సమాచారం మేరకు కత్తెర సురేశ్ విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది.

