నవంబరు వరకు సమీర్‌ శర్మే

ABN , First Publish Date - 2022-05-14T08:22:47+05:30 IST

నవంబరు వరకు సమీర్‌ శర్మే

నవంబరు వరకు సమీర్‌ శర్మే

csగా పదవీకాలం మరో 6 నెలలు పొడిగింపు


అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మ పదవీకాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. ఇప్పటికే రిటైర్మెంట్‌ వయసు తర్వాత రెండు విడతలుగా ఆరు నెలలు పొడిగింపు లభించగా.. ఇప్పుడు ఒకేసారి ఆరు నెలలు అవకాశం దక్కింది. దీంతో నవంబరు వరకు ఆయనే సీఎ్‌సగా కొనసాగనున్నారు. పదవీవిరమణ తర్వాత ఏడాది కాలం పాటు సీఎ్‌సగా కొనసాగే అవకాశం ఇటీవలి కాలంలో సమీర్‌ శర్మకు మాత్రమే దక్కింది. గతంలో పనిచేసిన సీఎ్‌సలకు మూడు లేదా ఆరు నెలల పాటు మాత్రమే పొడిగింపు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కాకి మాధవరావు ఒక్కరికే ఏడాది పాటు కొనసాగింపు లభించింది.


Read more