నేటి నుంచి పరిశ్రమలకు కోతల సడలింపు

ABN , First Publish Date - 2022-05-14T08:23:36+05:30 IST

నేటి నుంచి పరిశ్రమలకు కోతల సడలింపు

నేటి నుంచి పరిశ్రమలకు కోతల సడలింపు

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా విషయంలో ప్రస్తుతం ఉన్న నియంత్రణలను సడలిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. డిస్కంల అభ్యర్థన మేరకు.. శనివారం నుంచి నిరంతరం పనిచేసే పరిశ్రమలకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా 30 శాతం కోతతో..  మిగతా సమయంలో 40 శాతం కోతతో విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించింది. అదే విధంగా నాన్‌ కంటిన్యూస్‌ ప్రాసెస్‌ ఇండస్ట్రీ్‌సలకు ఎలాంటి నియంత్రణ లేకుండా సరఫరా చేయాలన్నారు.


Read more