-
-
Home » Andhra Pradesh » Reduce import duty on castor oil-NGTS-AndhraPradesh
-
ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించండి
ABN , First Publish Date - 2022-05-14T09:34:09+05:30 IST
ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించండి
కేంద్రానికి సీఎం జగన్ లేఖలు
అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): ఆవనూనె దిగుమతులపై దిగుమతి సుంకం తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వంట నూనెల కొరత నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్‌కు శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రస్తుతం ముడి ఆవ నూనెపై 38.5శాతం, శుద్ధిచేసిన ఆవనూనెపై 45శాతం దిగుమతి సుంకం ఉందని తెలిపారు. ఆవనూనె దిగుమతికి ఈ సుంకాలు ప్రతిబంధకంగా మారాయని పేర్కొన్నారు. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కనీసం ఏడాదికాలం పాటు దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

