ముందే రుతురాగం!
ABN, First Publish Date - 2022-05-14T08:12:56+05:30
ముందే రుతురాగం!
27న కేరళలోకి నైరుతి ప్రవేశం
రేపు దక్షిణ అండమాన్‌కు రాక
వాతావరణం అనుకూలంగా ఉండడంతో
ఐదు రోజులు ముందుగానే ఆగమనం
ఈ ఏడాది సీజన్‌లో సాధారణ వర్షపాతం
భారత వాతావరణ శాఖ ప్రకటన
విశాఖపట్నం, మే 13(ఆంధ్రజ్యోతి): వేసవి తాపం, ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి, రైతాంగానికి తీపికబురు. దేశంలో వ్యవసాయ రంగానికి మూలమైన నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళను తాకనున్నాయి. 15న దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించనున్నాయి. సాధారణంగా మే 20కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, జూన్ ఒకటికల్లా కేరళను నైరుతి రుతుపవనాలు తాకాలి. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు వాతావరణం అనుకూలంగా మా రింది. వారం క్రితం బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఏర్పడడడంతో పాటు పసిఫిక్, హిందూ మహాసముద్రంలో అనుకూల పరిస్థితులు నెలకొనడంతో నిర్ణీత గడువు కంటే ఐదు రోజులు(అటు ఇటుగా నాలుగు రోజులు) ముందుగానే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ శుక్రవారం బులెటిన్ విడుదల చేసిం ది. కాగా దక్షిణ అండమాన్ సముద్రంలోకి ఈ నెల 15న నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. 14నే దక్షిణ అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు వస్తాయని గురువారం భార త వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే శనివారం కాకుం డా ఆదివారం రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాజా బులెటిన్‌లో వివరించింది.
ఈ ఏడాది సాధారణ వర్షపాతం
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో జూన్ నుంచి సెప్టెంబరు వరకు 4 నెలల్లో సాధారణ వర్షపాతం కురవనుంది. ఈ మేరకు గత నెల 14న తొలి అంచనా నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 101 శాతం(96-104ు) నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. 1971-2020 వరకు కురిసిన వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని 4 నెలల సీజన్‌లో 87 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుందని వివరించింది. సీజన్ 4 నెలల్లో దేశంలో ఎక్కడెక్కడ.. ఎంతెంత వర్షపాతం నమోదవుతుందో ఐఎండీ అం చనా వేసింది. ఏపీకి సంబంధించినంత వరకు దక్షిణ, మధ్య కోస్తా, రాయలసీమలో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అదే ఉత్తర కోస్తా జిల్లాల్లో సాధారణంగా, కొన్ని చోట్ల ఎక్కువ నమోదవుతుంది.
