ప్రాజెక్టులపై వైసీపీ చిన్నచూపు

ABN , First Publish Date - 2022-05-14T06:59:22+05:30 IST

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ రైతులకు తీవ్రనష్టం కలిగిస్తోందని, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు.

ప్రాజెక్టులపై వైసీపీ చిన్నచూపు
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం, మే 13 :
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ రైతులకు తీవ్రనష్టం కలిగిస్తోందని, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. మండలంలో శుక్రవారం సాయం త్రం అమానిగుడిపాడు గ్రామంలో జరిగిన టీడీపీ బాదుడే, బాదుడే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.  పోలవరం ప్రాజెక్టును 70 శాతం టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించే వెలిగొండప్రాజెక్టును పూర్తి చేయకుండా సంవత్సరానికి 3 వాయిదాలు వేస్తూ నిర్లక్ష్యం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అని విమర్శించారు. అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాజధానుల పేరిట ముక్కలుచెక్కలు చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో రైతులకు  50 శాతం రాయితీతో వ్యవసాయయాంత్రికరణ యంత్రాలు, 90 శాతం  రాయితీతో డ్రిఫ్‌ ఇరిగేషన్‌ అమలు చేస్తే, ఇపుడు అధికారంలోఉన్న వైసీపీ వాటిని తీసేసిందన్నారు. దళితులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును టీడీపీ  అమలుజేస్తోందన్నారు. ఇటివల విద్యుత్తు చార్జీలు పెంచి అన్ని వర్గాల ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రానికి నారాచంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి  కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.  జడ్పీమాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర మాట్లాడుతూ అమానిగుడిపాడు గ్రామం టీడీపీ పార్టీకి కంచుకోట అన్నారు.   టీడీపీ ఆవిర్భావం నుంచి సర్పంచి, ఎంపీటీసీ పదవులకు టీడీపీ అభ్యర్థులు గెలుచుకున్నా రన్నారు. ఈ గ్రామంనకు రోడ్డు వేయకుండ ఇబ్బందులు కల్గిస్తే 2014లో టీడీపీ అధికారం చేపట్టాక  6 కి మీ పోడవునా బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఈ సారి ప్రతిఓటరు టీడీపీకి ఓట్లు  వేసి చంద్రబాబును  ముఖ్యమంత్రి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, ఏఎంసీ మాజీ  చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, ఎర్రగొండపాలెం మండల టీడీపీ మాజీ అధ్యక్షులు కామేపల్లి వెంకటేశ్వర్లు, షేక్‌ జిలానీ, వడ్లమూడి లింగయ్య, , ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.మంత్రునాయక్‌, రైతు అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి, తెలుగుయువత నాయకులు వేగినాటి శ్రీను, తోట మహేష్‌, త్రిపురాంతకం దేవస్థానం మాజీ చైర్మన్‌ గోళ్ల సుబ్బారావు, ఎర్రగొండపాలెం మాజీ సర్పంచి కంచర్ల సత్యనారాయణగౌడ్‌, మైనార్టిసెల్‌ అధ్యక్షుడు, షేక్‌ ఇస్మాయిల్‌,  తెలుగుయువత కార్యదర్శి పాలడుగు వెంకటకోటయ్య, అమానిగుడిపాడు టీడీపీ నాయకులు జాగర్లమూడి గాలెయ్య, రైతునాయకులు పోతిరెడ్డి రమణారెడ్డి,  మండల టీడీపీ ప్రధానకార్యదర్శి గోరంట్ల కనకారావు, యూత్‌ నాయకులు కొత్త భాస్కర్‌, అమానిగుడిపాడు సర్పంచి వైదన దివ్యా, కోటేశ్వరరావు, ఎంపీటీసీ గార్లపాటి మరియకుమారి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

Read more