క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలి

ABN , First Publish Date - 2022-05-15T05:17:58+05:30 IST

క్రీడాకారులు గెలుపు, ఓ టములను సమానంగా స్వీకరించాలని టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.

క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలి
క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

చినగంజాం, మే 14:  క్రీడాకారులు గెలుపు, ఓ టములను సమానంగా స్వీకరించాలని టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పెదగంజాంలోని జడ్పీ పాఠశాలలో లక్ష్మారెడ్డి మెమోరియల్‌ క్రికెట్‌ టీమ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి టెన్ని స్‌బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యానికి క్రీడ లు దోహదపడతాయనాన్నరు. ఈ పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతా ల్లోని క్రీడాకారులలోని ప్రతిభను వెలికి తీయవచ్చునని చెప్పారు.  క్రీడాకారులను పరచయం చేసుకొని, బ్యాటింగ్‌ చేసి క్రీడాకారులను ఏలూరి ఉత్సాహపరిచారు. ఈ పోటీలకు పలు ప్రాంతాల నుంచి 40 టీమ్‌లు వచ్చినట్లు కమిటీ సభ్యులు పి.మల్లిఖార్జునరెడ్డి, ఎ.రామ కృష్ణారెడ్డి, ఎం.వెంకట్‌ తెలిపారు. 

మొదటి రోజు రెండు మ్యాచ్‌లను నిర్వహించి నట్లు చెప్పారు. మొదటి మ్యాచ్‌లో కుక్కలవారి పాలెం జట్టు నిర్ణీత పది ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 60 చేయగా, తదుపరి బ్యాటింగ్‌ చేసిన పల్లెపాలెం జట్టు పది ఓవర్లలో 58 ప రుగులకు ఆలౌట్‌ అయి ఓటమిపాలైంది. తదపరి మ్యాచ్‌లో పెద గంజాం జట్టు పది ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. తదపరి బ్యాటింగ్‌ చేసిన ఏటిమొగ జట్టు మూడు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసి విజయం సాధించింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఏలూరి యువసేన నాయకులు పాల్గొన్నారు. 


Read more