మార్కాపురం చెరువులో వ్యర్థాలు..!

ABN , First Publish Date - 2022-05-15T04:29:32+05:30 IST

మార్కాపురంలోని ప్రధాన జలవనరు చెరువు. ఎన్నో ఏళ్ల నుంచి చెరువులో నీటితో పంటలు పండించేవారు. చెరువు ద్వారా, బావుల ద్వారా, తాగునీటి సౌకర్యం సమకూరేది.

మార్కాపురం చెరువులో వ్యర్థాలు..!
నల్లగా మారిన చెరువు నీరు చెరువులో వేసిన చెత్త, వ్యర్థాలు

మురుగు నీటితో కలుషితమవుతున్న నీళ్లు

రోగాలకు నిలయంగా మారుతున్న వైనం

ఆందోళనలో పట్టణవాసులు 

మార్కాపురం(వన్‌టౌన్‌), మే 14: మార్కాపురంలోని ప్రధాన జలవనరు చెరువు. ఎన్నో ఏళ్ల నుంచి చెరువులో నీటితో పంటలు పండించేవారు. చెరువు ద్వారా, బావుల ద్వారా, తాగునీటి సౌకర్యం సమకూరేది. దాదాపు 600 ఎ కరాల్లో ఉన్న మార్కాపురం చెరువు నేడు చెత్త, వ్యర్థాలు, మురుగు కాలువల పారకంతో జలాలు విష పూరితంగా మారుతున్నాయి. పట్టించుకోవాల్సిన నీటి పారుదల శాఖ నిద్ర నటించడంతో పాటు ప్రజారోగ్యాన్ని పర్యవేక్షించాల్సిన మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది చెరువు శుభ్రతను పాటించడం లేదు. దీంతో మార్కాపురం చెరువు విషపూరిత వ్యర్థాలతో నిండిపోయింది. గతంలో మంచి నీటి చెరువుగా ఉన్న ఈ చెరువు నేడు హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లా మారనుంది. గత కొన్నేళ్లుగా మార్కాపురం చెరువు నుంచి వ్యవసాయానికి కూడా నీరందించకుండా పట్టణంలో భూగర్భ జలాలు పెంచేందుకు చెరువు నీటిని నిల్వ ఉంచుతున్నారు. కానీ అధికారుల తీరుతో మార్కాపురం చెరువు మురికి కూపంగా మారింది. పారిశ్రామిక వాడ డ్రైవర్స్‌ కాలనీ,  కొండారెడ్డి కాలనీ, అలుగు, చిన్నబ్రిడ్జ్‌, 9, 20 వార్డులు, చెన్నరాయునిపల్లె వరకు చెరు వులో మురుగు నీరు వదులుతున్నారు. బెస్త కాలనీ నుంచి చిన్నబ్రిడ్జి వర కు ఉన్న చెరువు కాలువలో వ్యర్థాలు వేస్తున్నారు. ఇళ్ల మ రుగుదొడ్ల కనెక్షన్లు కూడా చెరువు కాలువకే అనుసంధానం చేయడంతో చెరువు జలాలు మరింత ప్రమాదకరంగా తయార య్యా యి. ఇక ప్రధానంగా చెరువులో చెత్త, చెదారం, ఖాళీ కొబ్బరి బొండాలు, తాటి ముంజలు, 

ఇళ్లు పడగొట్టిన రాళ్లు, మట్టితో పాటు వివిధ రకాల కోళ్ల, పొ ట్టేళ్ల వ్యర్థాలు చెరువులో కలుపు తున్నారు. అంతేకాక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వివి ధ అంటురోగాలు ఉన్నవారి దిండ్లు, పరు పులను కూడా చెరువులోకి విసిరేస్తున్నారు. వివిధ ఆసుపత్రుల నుంచి ఇంజక్షన్లు, వాడేసిన మందులు కూడా చెరువు నీళ్లలో కలపడంతో మా ర్కాపురం చెరువు మరింత కలుషితం అవుతోంది.  గత పదేళ్లుగా మార్కా పురం చెరువులో లక్షల రూపాయల నిధులు వెచ్చించి వివిధ పనులు చేసినప్పటికీ చెరువులో ఉన్న కంపను తీయించలేదు. అధికారులు, కాంట్రా క్టర్లు కుమ్మక్కై లక్షలు మింగారే కానీ చెరువు శుభ్రతపై ఏమాత్రం బాధ్యతగా లేరని స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  చెరువు నీరు కలుషితం అవుతున్న నేపథ్యంలో పట్టణంలోని వివిధ బోర్ల జలాలు కూడా కలుషితమై ప్రజలు వ్యాధులబారినపడుతున్నారు. ఏలూరులో కలుషిత జలాలు తాగి వందలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇటువంటి ఘట నలు జరిగినా కూడా అధికారులలో స్పందన లేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామికి చెరువు శుభ్రంగా ఉన్నప్పుడు తెప్పోత్సవం నిర్వహించేవారు. కానీ నీటి పా రుదల శాఖ అధికారులు ఆ ఏర్పాట్లు చేయకపోవడంతో చెరువులో నిర్వ హించే తెప్పోత్సవం ఆగిపోయింది. పాలకవర్గాలు, ప్రజా ప్రతి నిధులు, నీటిపారుదల శాఖ, మున్సిపల్‌ శాఖలు స్పందించి మార్కాపురం చె రువును కలుషితం కాకుండా కాపాడుకోవాలని పర్యావరణవేత్తలు తెలుపుతున్నారు. 


Read more