ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆ సేవలు వెలకట్టలేనివి!

ABN, First Publish Date - 2022-05-15T05:21:34+05:30

రోడ్డుప్రమాదాలు పెరిగిపోయాయి. అయితే అందులో ఒక్కో ప్రమాదం హృదయ విదారకరం.ఒక్కోసారి రోడ్డుప్రమాదాల్లో చనిపోయిన వారి శరీరాలు ఛిద్రమై సొంతవారు కూడా చూడలేని పరిస్థితి ఉంటుంది. బతికి ఉన్నప్పుడు ఎంత ప్రేమాభిమానాలున్నా ప్రమాద ఘటనల్లో దగ్గరికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అంత భయానక పరిస్థితుల్లోనూ మృతదేహాలను ఒకచోటకు చేర్చి పోలీసులు, కుటుంబ సభ్యులకు అప్పగించడంలో వెంకటయ్య చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. కేవలం రూ.4వేల జీతానికి ఎవరూ చేయలేని పనిని ఆయన చేస్తున్నాడు చిన్న వెంకటయ్య. ఆయనది దోర్నాల. అతని భార్య లక్ష్మమ్మ రజక వృత్తి చేస్తుంది.

ప్రమాదంలో మృతి చెందిన వారి ముక్కలైన శరీర భాగాలను ఒక చోట చేర్చి మూటగడుతున్న వెంకటయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

రోడ్డుప్రమాదం జరిగితే 

వెంటనే అక్కడకు పరుగు..

ఛిద్రమైన శరీరభాగాలను మూటగట్టి

పోలీస్‌స్టేషన్‌కు, ఆస్పత్రికి అప్పగింత

25 సంవత్సరాలుగా అదే పని

పెద్ద దోర్నాల, మే 14 : రోడ్డుప్రమాదాలు పెరిగిపోయాయి. అయితే అందులో ఒక్కో ప్రమాదం హృదయ విదారకరం.ఒక్కోసారి రోడ్డుప్రమాదాల్లో చనిపోయిన వారి శరీరాలు ఛిద్రమై సొంతవారు కూడా చూడలేని పరిస్థితి ఉంటుంది. బతికి ఉన్నప్పుడు ఎంత ప్రేమాభిమానాలున్నా ప్రమాద ఘటనల్లో దగ్గరికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అంత భయానక పరిస్థితుల్లోనూ మృతదేహాలను ఒకచోటకు చేర్చి పోలీసులు, కుటుంబ సభ్యులకు అప్పగించడంలో వెంకటయ్య చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. కేవలం రూ.4వేల జీతానికి ఎవరూ చేయలేని పనిని ఆయన చేస్తున్నాడు చిన్న వెంకటయ్య. ఆయనది దోర్నాల. అతని భార్య లక్ష్మమ్మ రజక వృత్తి చేస్తుంది. అలాగే పోలీస్‌ స్టేషన్‌లో స్వీపర్లుగా పనిచేస్తున్నారు. అతడి తండ్రి కూడా గతంలో స్టేషన్‌లోనే చిన్నచిన్న పనులు చేస్తూ మృతిచెందాడు.  

వెంకటయ్య 18 ఏళ్లకే పనిలో చేరాడు. ప్రమాదాలు జరిగి మృతిచెందిన వారి శరీరాలను పోలీస్‌ స్టేషన్‌కు, పోస్టుమార్టం కోసం ఆస్పత్రులకు తరలించాల్సి ఉంటుంది. ఈక్రమంలో వెంకటయ్య ధైర్యంగా ఘటనా స్థలానికి వెళ్లి రోడ్డుపై పడిన మృతదేహాలు, ఛిద్రమైన శరీరభాగాలను మూటగట్టి అప్పచెప్తాడు. 25సంవత్సరాలుగా వెంకటయ్య అదే పనిచేస్తున్నాడు. గతంలో రూ.1600లు వేతనం ఇస్తుండగా ఏడాది క్రితమే రూ.4వేలకు పెంచారు. 


అసాధారణమే అయినా..

నెలకు రూ.4వేలు కాదు కదా రూ.40వేలు ఇచ్చినా వెంకటయ్య సేవలు ఎవ్వరూ చేయలేరనేది నిస్సందేహం. శ్రీశైలం-దోర్నాల, కర్నూలు-దోర్నాల రెండు 40 కిలోమీటర్ల పరిధి వరకూ ఘాట్‌రోడ్లు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఎందరో మృత్యువాతపడ్డారు. ఒక్కో ఘటన జరిగిన తీరు చూస్తే భయానకంగా ఉంటాయి. వాటిని ఒకచోట చేర్చి మూటగట్టాలి. నాలుగైదు రోజుల కింద నీటిలో పడి మృతిచెంది శరీరం ఉబ్బి భరించలేని దుర్వాసనతో భాగాలన్నీ ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఊడిపోతుంటాయి. అయినా నీటిలో దిగి ఆ శరీర భాగాలను బయటకు తీసి మూటగడతారు. హత్య చేసి గుర్తు పట్టకుండా పెట్రోలు పోసి తగులబెట్టిన శవాలు, పురుగుపట్టినవి మూటగట్టి పోలీసుస్టేషన్‌కు తరలిస్తుంటారు. అటవీ ప్రాంతంలో పైగా మహిళల దేహాలు మరింత భయంకరంగా ఉన్నా ఆ పనిని వెంకటయ్య సునాయాసంగా చేస్తాడు. మద్యం సేవించి చేస్తాడనుకుంటే పొరబాటే. వెంకటయ్యకు మద్యం తాగే అలవాటు లేదు. ఎవరూ ముందుకు వెళ్లలేని, తీయలేని మృతదేహాలను విసుగు లేకుండా సేకరిస్తాడు. పైగా ఆ సేవ తనకు దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తాడు. నిజంగా ఆయన సేవలు అసాధారణమైనవి. వెంకటయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.


ఉద్యోగ భద్రత కల్పించాలి  

వెంకటయ్య భార్య లక్షమ్మ మాట్లాడుతూ తనను ఎస్పీ నవీన్‌చంద్‌ పనిలోకి నియమించారు. ఆయన రుణం తీర్చుకోలేనిది. దంపతులిద్దరం పోలీసుస్టేషన్‌ను నమ్ముకుని పనిచేస్తున్నాం. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని అధికారులను వేడుకున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!