ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఏసీబీ దాడుల కలకలం

ABN, First Publish Date - 2022-05-14T07:00:43+05:30

ముండ్లమూరు తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు.

ముండ్లమూరు తహసీల్దార్‌ కార్యాలయంలోతనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తహసీల్దార్‌, సిబ్బంది అవినీతిపై సీఎం పేషీకి ఫిర్యాదు 

ముండ్లమూరు మండల రెవెన్యూ కార్యాలయంలో తనిఖీలు

వీఆర్‌వో, డేటా ఆపరేటర్‌ దగ్గర రూ.3,500 చొప్పున స్వాధీనం

12 పట్టాదారు పాసుపుస్తకాల గుర్తింపు 

తహసీల్దార్‌కు డబ్బులిచ్చామని ఫిర్యాదు చేసిన రైతులు

విస్తుపోయిన అవినీతి నిరోధకశాఖ అధికారులు

రికార్డుల అస్తవ్యస్తంపై ఆగ్రహం 

రాత్రి 9గంటల వరకు సోదాలు

దొనకొండ తహసీల్దార్‌కు ఇక్కడేం పని అని ప్రశ్నించిన డీఎస్పీ 

ముండ్లమూరు, మే 13 : ముండ్లమూరు తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. రాత్రి 9గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. ముండ్లమూరుకి చెందిన జానపాటి శ్రీనివాసరావు, మరో ఆరుగురు ఇటీవల సీఎం కార్యాలయంలోని 14400 (స్పందన)కు ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలో శుక్రవారం 12:45కు తహసీల్దార్‌ కార్యాలయానికి ఏసీబీ అధికారులు వచ్చారు. ఇన్‌చార్జి ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 12 పాసుపుస్తకాలు రైతులకు అందజేయకుండా కార్యాలయంలో ఉంచుకోవడంతోపాటు రెవెన్యూ రికార్డుల్లో అనేక లోపాలు ఉన్నట్టు గుర్తించారు. తనిఖీల సమయంలో ఉమామహేశ్వర అగ్రహారం వీఆర్వో కావూరి దయానందం దగ్గర రూ.3,500, కార్యాలయ డేటా ఆపరేటర్‌ శ్రీనివాసరావు వద్ద రూ.3,500 నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్‌ పార్వతితోపాటు మరి కొంతమంది అధికారులను ప్రశ్నించారు. కార్యాలయంలో సోదాలు చేస్తున్న సమయంలో ముండ్లమూరుకు చెందిన సోమేపల్లి కొండయ్య, కంకణాల హనుమంతరావు మరికొంతమంది తమ దగ్గర తహసీల్దార్‌ డబ్బులు తీసుకున్నట్టు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారి వద్ద స్టేట్‌మెంట్‌ కూడా రికార్డు చేశారు. ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. కార్యాలయ అవినీతి వ్యవహారాలన్నీ ఏసీబీ అధికారులకు చెప్పడంతో వారు విస్తుపోయారు. కాగా బయట ఉన్న పలువురు వీఆర్వోలను కూడా పిలిచి విచారించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి తహసీల్దార్‌ పార్వతితోపాటు సిబ్బందిపై ఫిర్యాదులందాయన్నారు. నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ఏశాఖ అధికారులైనా తమ పనులు చేయకుండా నిత్యం తిప్పుతూ లంచాలు అడుగుతుంటే వెంటనే టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేయాలన్నారు. వెంటనే డీఎస్పీ బృందం టోల్‌ఫ్రీ పోస్టర్‌ను తహసీల్దార్‌ కార్యాలయానికి అంటించారు. ముండ్లమూరు గ్రామ రెవెన్యూ రికార్డుల వరకూ వారి వెంట తీసుకెళ్లారు. 


మారువేషంలో వచ్చి  తహసీల్దార్‌ కారు సైతం తనిఖీ 

తహసీల్దార్‌ కార్యాలయానికి ఏసీబీ అధికారులు లుంగీలు కట్టుకొని మారువేషంతో వచ్చారు. ముందుగా తహసీల్దార్‌ కారును తనిఖీ చేశారు. అక్కడి నుంచి లోపలకు వచ్చి కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు వెళ్లనివ్వకుండా తలుపులు వేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో దొనకొండ తహసీల్దార్‌ కె.వెంకటేశ్వరరావు కార్యాలయంలో ఉండటంతో ఏసీబీ అధికారులు మీరు ఎవరు.. ఇక్కడేం పని అని ప్రశ్నించారు. తాను దొనకొండ తహసీల్దార్‌నని చెప్పడంతో వెళ్లిపో అన్నారు. అనంతరం సింగనపాలెం వీఆర్వో వేణుగోపాల్‌ రెడ్డి కారును సైతం తనిఖీ చేశారు. ఈ దాడుల్లో డీఎస్పీతోపాటు సీఐలు టీవీ శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ అపర్ణ, సిహెచ్‌.శేషు, యు.నాగరాజు, ఎస్‌ఐలు ప్రసాద్‌, హరీష్‌ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారన్న సమాచారం అందుకున్న మండలంలోని వీఆర్‌వోలు, ఎంపీడీవో, వివిధ శాఖల ఽఅధికారులు కార్యాలయాల నుంచి వెళ్లిపోయారు. ముండ్లమూరు తహసీల్దార్‌ కార్యాలయంలో గతంలో ఇద్దరు తహసీల్దార్లు, ముగ్గురు వీఆర్వోలు, డీటీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!