ప్రత్యేక స్పందనకు వినతుల వెల్లువ
ABN, First Publish Date - 2022-05-14T06:51:15+05:30
ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. మార్కాపురంలోని బొగ్గరపు కల్యాణ మండపంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక స్పందనలో అధికారులకు మొత్తం 334 అర్జీలు అందాయి.
మార్కాపురంలో ఎస్సీ, ఎస్టీల కోసం ఏర్పాటు
సద్వినియోగం చేసుకున్న ప్రజలు
మార్కాపురం, మే 13: ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. మార్కాపురంలోని బొగ్గరపు కల్యాణ మండపంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక స్పందనలో అధికారులకు మొత్తం 334 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ దినే్‌షకుమార్ మాట్లాడుతూ స్పందన అర్జీలను పరిష్కరించడంలో మానవతా దృక్పధంతో వ్యవహరించాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అహంభావం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. ఫిర్యాదులు చేసినా, అధికారులు స్పందించనవే తిరిగి మళ్లీ వచ్చాయ న్నారు. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదన్న విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయాలన్నారు. అర్జీదారులకు అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, జాయింట్ కలెక్టర్ అభిషక్త్ కిశోర్, డీఆర్వో శ్రీనివాసులు, ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సరళా వందనం, గ్లోరియా, నారదముని, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
- మార్కాపురం మండలం దరిమడుగులో తనకు పసుపు, కుంకుమల కింద ఇచ్చిన పొలాన్ని మంత్రి సురేష్ ఆక్రమించాడని రంగలక్షమ్మ పిర్యాదు చేసింది.
- 1979లో తర్లుపాడులోని 80 మంది ఎస్సీలకు 80 ఎకరాల భూమిని రైల్వే స్టేషన్ వద్ద భూమికి పట్టాలు పంపిణీ చేశారు. ఆ భూమికి రహదారి లేకపోవడంతో పొలాలన్ని బీడు భూములుగా ఉన్నాయని, రహదారులు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున రైతులు కలెక్టర్ ముందు వాపోయారు.
- తర్లుపాడు ఎస్సీ పాలెంలో కూడా కనీస మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
- తుమ్మలచెరువు గ్రామానికి చెందిన షేక్ షబినాబీ వికలాంగుల పింఛన్ ఇప్పించాలని కలెక్టర్ కు విన్నవించుకున్నారు.
- కొనకలమిట్ల మండలం గుర్రపుసాలకు చెందిన యుద్దనపుడి రాణి మూడేళ్ల క్రితం కట్టుకున్న కాలనీ గృహానికి బిల్లు రాలేదని ఆన్లైన్లో మాత్రం బిల్లు చెల్లించినట్లు చూపిస్తోందని తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. మార్కాపురంలోని ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు వినతిపత్రం అందజేశారు.
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం
చేపలవేటపై జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోందని కలెక్టర్ ఏ.ఎ్‌స.దినే్‌షకుమార్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకంలో భాగంగా మత్స్యకార కుటుంబానికి రూ.10 వేల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమచేస్తుందన్నారు. అనంతరం మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో జిల్లా స్థాయిలో సమావేశంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డితో కలిసి శుక్రవారం కలెక్టర్ దినే్‌షకుమార్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకార భరోసా పథకంలో భాగంగా ఈ యేడాది జిల్లాలో 4655 మందికి రూ.4.65 కోట్ల లబ్ధిచేకూరుతుందన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో 257 మందికి, ఒంగోలు నియోజకవర్గంలో 3104 మందికి, కొండపిలో 1294 మందికి లబ్ధి చేకూరినట్లు తెలిపారు. సముద్ర వేట నిషేధిత కాలంలో సహాయ భృతి, డీజిల్‌పై రాయితీ, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ, వేటలో మరణించే మత్స్యకార కుటుంబాలకు ఆర్ధిక సహాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రూ.40.98 కోట్ల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మత్సశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, డీపీవో నారాయణరెడ్డి, మత్స్యకార సంఘం నాయకులు షేక్ సైదా, జిల్లా మత్స్యకారసంఘం అధ్యక్షులు వి.శ్రీనివాసరావు, తీరప్రాంత యూనియన్ అధ్యక్షులు జి.నాగార్జున తదితరులు పాల్గొన్నారు.