కారు బోల్తా.. ఒకరు మృతి
ABN, First Publish Date - 2022-05-14T05:48:41+05:30
దర్శి పట్టణ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెందాడు.
దర్శి, మే 13 : దర్శి పట్టణ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్ర కారం... దర్శి నగర పంచాయతీ పరిధిలోని చింతలపాలేనికి చెందిన చంద్రగిరి వీరారెడ్డి(30) కారులో దర్శి నుంచి తూర్పుచౌటపాలెం వెళ్తుండగా అదుపుతప్పి పొలాల్లో బోల్తా కొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న వీరారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. నిద్రమత్తులో కారు నడుపుతూ అదుపుతప్పి బోల్తా పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఎస్సై ఏ చంద్రశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి
దర్శి, మే 13 : మం డలంలోని సామంతపూ డి గ్రామానికి చెందిన పోలా కుమారి(22) వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెం దింది. పోలీసుల కథ నం ప్రకారం... కందుకూరుకు చెందిన కు మారిని ఆరేళ్ల క్రితం సామంతపూడి గ్రామానికి చెందిన పోలా శ్రీనివాసరావుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు సంతానం. గురువారం రాత్రి భర్త శ్రీనివాసరావు కుమారి సోదరుడు వంశీమూర్తికి ఫోన్ చేసి నీ చెల్లెలు చనిపోయిందని చెప్పాడు. పుట్టింటి వారు హుటాహుటిన బయలుదేరి వచ్చి కుమారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో దర్శి యువకుడు మృతి
గణపవరం(నాదెండ్ల), మే 13 : మండలంలోని గణపవరం గ్రామ పరిధిలోని జాతీయరహదారిపై శు క్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్శి గ్రామానికి చెందిన యువకుడు మృతి చెం దాడు. గుంటూరు నుంచి ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట వెళుతున్న ఆ యువకుడు డివైడర్‌ను ఢీకొట్టాడు. అతను రోడ్డు మీద పడడంతో తల పగలి అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వద్ద ఉన్న ఆధార్ కార్డు ప్రకారం కణదం సాయిఅవినా్‌షగా గుర్తించారు. దర్శిలో నివాసం ఉంటున్నట్లు, తండ్రి హనుమంతరావుగా ఆధార్‌కార్డులో వివరాలు ఉన్నాయి. నాదెండ్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.