ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నిలదీతలు.. బహిష్కరణలు

ABN, First Publish Date - 2022-05-14T06:57:04+05:30

ముచ్చటగా మూడేళ్లకు ప్రభుత్వ కార్యక్రమం పేరుతో జనం వద్దకెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు ప్రజలు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

విద్యుత్‌ సమస్యపై మంత్రి సురేష్‌ను ప్రశ్నిస్తున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

సుధాకర్‌బాబు కార్యక్రమాన్ని బహిష్కరించిన ముఖ్య నేతలు 

తిమ్మసముద్రంలో నిలదీసిన దళితులు 

తాగునీటిపై ప్రజల ప్రశ్నల వర్షంతో మెల్లగా జారుకున్న ఎమ్మెల్యే బుర్రా 

వైసీపీ శ్రేణుల ఇళ్లే  సందర్శించిన మంత్రి సురేష్‌ 

అయినా సచివాలయంలో  ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతుల గగ్గోలు 

బాలినేని, అన్నా, మద్దిశెట్టి గైర్హాజరు 

నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రంలో పేదలకు స్థలమిచ్చి, గృహం నిర్మించి తాళాలు ఇస్తామన్న సీఎం తన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబును పేద మహిళలు నిలదీశారు. గోకతోటి కృపారావు అనే వ్యక్తి ఎమ్మెల్యేతో మాట్లాడుతూ తాను డయాలసిస్‌ రోగినని, మూడు నెలలు మాత్రమే పెన్షన్‌ ఇచ్చి తర్వాత ఆపారని తెలిపాడు. తనకు పెన్షన్‌ రాకపోవటానికి కారణం తెలపాలని వలంటీర్‌ను, సచివాలయ సంక్షేమ ఉద్యోగిని కోరగా ముఖ్యమంత్రి దగ్గర డబ్బులు లేవని చెప్పారని తెలిపారు. తాను ఇప్పుడు డయాలసిస్‌ చేయించుకోవాలని తనకు వెంటనే ఆరోగ్య పెన్షన్‌ వచ్చేవిధంగా చేయాలని కోరాడు.

కనిగిరి పట్టణంలోని ఇందిరాకాలనీలో ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ గడపగడపకూ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. స్థూపం బజారులో నివాసం ఉంటున్న మబ్బులా అనే మహిళ మంచినీరు సక్రమంగా రావటం లేదని, రంజాన్‌ మాసంలో నానా ఇబ్బందులు పడ్డామని ఎమ్మెల్యేని, వార్డు కౌన్సిలర్‌ను నిలదీసింది. ఇదేమి అని అడిగితే ‘మీకు ఈ బజారులో ఓట్లు లేవు, ఓట్లు ఉన్న బజారుకు చెందిన కౌన్సిలర్‌ను అడగాలని చెప్పటం ఎంతవరకు సబబు’ అని ఆవేదన వ్యక్తం చేసింది.  

ముచ్చటగా మూడేళ్లకు ప్రభుత్వ కార్యక్రమం పేరుతో జనం  వద్దకెళ్తున్న  వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు ప్రజలు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరోవైపు పార్టీశ్రేణులు తమ అసంతృప్తి బావుటాను ఎగరేస్తూనే ఉన్నారు. ఫలితంగా గడపగడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంలో మూడో రోజైన శుక్రవారం కూడా జిల్లాలో పలు ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. డీజేలు, భారీ కార్ల కాన్వాయ్‌తో ఆర్భాటంగా వెళ్లిన ఎమ్మెల్యే సుధాకర్‌బాబు కార్యక్రమానికి నాగులుప్పలపాడు మండలంలోని ముఖ్యనేతలు డుమ్మా కొట్టారు. ఇంకోవైపు పింఛన్లు, ఇళ్లస్థలాల కోసం దళితవాడ ప్రజలు నిలదీశారు. కొత్తగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టి హుషారుగా కార్యక్రమం నిర్వహిస్తున్న కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ని తాగేందుకు మంచినీళ్లే ఇవ్వలేకపోతున్నారంటూ ప్రజలు చుట్టుముట్టడంతో ముఖం చాటేయక తప్పలేదు. ఇంకోవైపు మంత్రి సురేష్‌ ఎంపిక చేసిన వైసీపీ కార్యకర్తల ఇళ్లకే వెళ్లినప్పటికీ సచివాల యాన్ని సందర్శించిన సందర్భంలో రైతులు ట్రాన్స్‌ఫార్మర్ల కోసం, వైద్యశాలలో డాక్టర్‌ కోసం డిమాండ్‌ చేయడం గమనార్హం.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు చుక్కలు చూపెడుతోంది. నిలదీతలు, బహిష్కరణలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన శుక్రవారం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. తొలిరోజు కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తన వివాహ వార్షికోత్సవం కోసం కుటుంబంతో హైదరాబాద్‌ చేరారు. తొలి రెండు రోజులు నామమాత్రంగా కార్యక్రమం నిర్వహించిన దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్‌ కూడా మూడో రోజు కనిపించ లేదు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా కుటుంబసభ్యులతో తిరుమల వెళ్లి కార్యక్రమంలో పాల్గొనలేదు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి  అక్కడ కలెక్టరు నిర్వహించిన ప్రజాదర్బారులో హాజరై గడపగడపకు కార్యక్రమానికి డుమ్మా కొట్టారు.


సుధాకర్‌కు చుక్కెదురు 

మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితిని చూస్తే ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తొలిరోజు కార్యక్రమం కావటంతో ఆర్భాటంగా ప్రారంభించారు. డీజేలు, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్లతో కాన్వాయ్‌గా నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు నుంచి తిమ్మసముద్రం గ్రామానికి వెళ్లి గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే కార్యక్రమాన్ని పార్టీ ఎంపీపీ అంజమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు రత్నభారతి, వైసీపీ మండల అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావుతోపాటు తిమ్మసముద్రం గ్రామాన్ని మినహాయిస్తే మిగిలిన మండలంలోని ఆ పార్టీకి చెందిన 12మంది ఎంపీటీసీలలో ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. ఇక తిమ్మసముద్రంలో ఆది నుంచి వైసీపీ జెండా మోసిన ముద్దన రవి, ఆయనవర్గం గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీలోని ఒక గ్రూపు నాయకులను పక్కనబెడితే మిగిలిన నాయకులంతా ఎంపీపీ భర్త, వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి ఇంట్లో సమావేశం కావటం విశేషం. ఇక ఆర్భాటంగా తిమ్మసముద్రంలో పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే సుధాకర్‌బాబును ఆ గ్రామంలోని దళితవాడలో ప్రజలు ప్రశ్నల వర్షంతో బెంబేలెత్తించారు. అయ్యా జగనన్న ఇల్లు ఎక్కడ, ఆయన చెప్పినట్లు స్థలాలిచ్చి ఇల్లు కట్టించి ఆ ఇంటి తాళాలు మాకు ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్లండంటూ దళితవర్గానికి చెందిన సుందరమ్మ, బొమ్మల రాణి తదితరులు విలపిస్తూ నిలదీశారు. రూప అనే దివ్యాంగురాలైతే తన లాంటి వారికి కూడా పింఛన్‌  దక్కడం లేదని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అతీగతీ ఉండటం లేదని ఆక్రోశం వెళ్లగక్కారు. వెంటనే  తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని నిలదీశారు. 


మంత్రి సురేష్‌ను వైసీపీ వాళ్ల ఇంటికే  తిప్పిన నేతలు 

మంత్రి ఆదిమూలపు సురేష్‌ తన నియోజకవర్గంలోని కొత్త అన్నసముద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిరోజు మురారిపల్లిలో చోటుచేసుకున్న పరిస్థితులు ఎదురుకాకుండా స్థానిక నాయకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామంలో పూర్తిగా వైసీపీకి చెందిన వారి ఇళ్లకే ఆయనను తీసుకెళ్లారు. అయితే ఆయన సచివాలయంలో ఉన్న సమయంలో కొందరు గ్రామస్థులు వెళ్లి రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు సకాలంలో ఏర్పాటు చేయటం లేదనే విషయాన్ని చెప్పారు. అవసరమైన డిపాజిట్లు చెల్లించినా పట్టించుకునే వారే కనిపించటం లేదని వాపోయారు. పీహెచ్‌సీలో డాక్టరు లేక వైద్యసేవలు అందటం లేదని మరికొందరు చెప్పారు. దీంతో సమస్యలపై తక్షణం చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. కొండపి నియోజకవర్గంలో మలిరోజు కూడా కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్‌ వెంకయ్య గైర్హాజరు కావటం విశేషం.


కనిగిరిలో చిర్రుబుర్రు

 కనిగిరి నగర పంచాయతీలో తాగునీటి కోసం ప్రజలు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను నిలదీశారు. నగర పంచాయతీలోని ఒక కాలనీలో ఆయన గడపగడపకు కార్యక్రమానికి వెళ్లగా వారి ఇంటి ముందు ఖాళీగా ఉన్న డ్రమ్ములను చూపిస్తూ తాగునీటి కష్టాలను వివరించారు. ట్యాంకర్ల ద్వారా అక్కడ నీటి సరఫరా జరుగుతుండగా కనీసం 7 రోజులకు ఒక ట్యాంకరు కూడా రావటం లేదని ఆ ప్రాంత ప్రజలు నిలదీశారు. మీరు కనిపించరు, స్థానికంగా ఉన్న కౌన్సిలర్లను అడిగితే ఉలుకుపలుకు లేదంటూ ఆవేదన వెళ్లగగ్గారు. త్వరలో కొత్త కాంట్రాక్టరు ద్వారా నీటి సరఫరాను మెరుగుపరుస్తామని చెప్పుకుని ఎమ్మెల్యే అక్కడి నుంచి నిష్క్రమించారు. 








సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!