ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Ongole: ఎస్ఐ వినోద్ కుమార్ నిర్వాకం

ABN, First Publish Date - 2022-05-06T18:30:24+05:30

అతను పోలీస్ డిపార్టుమెంట్‌లో ఎస్ఐ. తప్పు చేసిన వారిని దండించాల్సిన ఆయన పక్కదారి పట్టాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

Ongole: అతను పోలీస్ డిపార్టుమెంట్‌లో ఎస్ఐ. తప్పు చేసిన వారిని దండించాల్సిన ఆయన పక్కదారి పట్టాడు. పెళ్లయిన రెండు నెలలకే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదేం పద్ధతని ప్రశ్నిస్తే కట్టుకున్న భార్యను వదిలేశాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కన్నీటి పర్యంతమవుతోంది.


నెల్లూరు జిల్లాకు చెందిన వినోద్ కుమార్ 2018 బ్యాచ్‌లో ఎస్ఐ ఉద్యోగం సంపాదించాడు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ట్రైనీ ఎస్ఐగా విధులు నిర్వహించే సమయంలో రోజారాణి అనే యువతితో పరిచయం ఏర్పడింది. రెండేళ్లు ఆమెతో సహజీవనం చేశాడు. వివాహం సమయంలో రూ. 35 లక్షల కట్నం వసూలు చేసి గత ఏడాది ఆగస్టు 22న ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.


పెళ్లయిన రెండు నెలలకే మరో మహిళతో సెల్‌ఫోన్‌లో ప్రేమ పాఠాలు వల్లిస్తూ భార్య రోజా రాణికి చిక్కాడు. ఇదే పద్ధతని నిలదీస్తే ఆమెను ఇంట్లో నుంచి బయటకు నెట్టాడు. దీంతో రోజా రాణి గత ఏడాది నవంబర్‌లో గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వినోద్ కుమార్‌ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే భార్యను కాపురానికి తీసుకువెళ్లేందుకు అంగీరించలేదు. గుంటూరులో ఉంటే సమస్యలు వస్తాయని ఒంగోలుకు బదిలీ చేయించుకున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రోజారాణి ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


మంగళగిరిలో గత నెల 28న రోజారాణి ఇచ్చిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు వినోద్ కుమార్ వ్యవహారంపై విచారణ జరిపారు. గురువారం ఎస్ఐను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ డీఐజీ తివిక్రమ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!