కొందరి గడపలకే మన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-14T07:03:02+05:30 IST

మండలంలోని కొత్తఅన్నసముద్రం గ్రామంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి సురేష్‌ ఆధ్వర్యంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కొందరి గడపలకే మన ప్రభుత్వం
సమస్యలపై మాట్లాడుతున్నమంత్రి సురేష్‌


ఎంపిక చేసిన ఇళ్లకే వెళ్లిన ప్రజాప్రతినిధులు
త్రిపురాంతకం, మే 13:
మండలంలోని కొత్తఅన్నసముద్రం గ్రామంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి సురేష్‌ ఆధ్వర్యంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన  వైసీపీకి అను కూలమైన ఇళ్ల వద్ద మాత్రమే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి వచ్చిన మంత్రి ముందుగా వై.ఎస్‌.ఆర్‌ విగ్రమానికి పూలమాల వేశారు. అనంతరం రెండు అంబేడ్కర్‌కాలనీల్లోని కేవలం ఆరు ఇళ్లకు మాత్రమే మంత్రి వెళ్లారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని అవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్‌ స్పూర్తితో ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ, బీసీలకు అన్ని రకాలుగా న్యాయం చేశామన్నారు. మహిళలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అం దిస్తున్నామని తెలిపారు. అనంతరం పంచాయితీ కార్యాలయం వద్ద గ్రామస్థులతో మాట్లాడారు. ఈసందర్బంగా ప్రాథమిక వైద్యశాలలో డాక్టరు అందుబాటులో ఉండడం లేదంటూ గ్రామస్థులు చెప్పడంతో డాక్టరు కరుణ్‌కుమార్‌ను వివరణ అడిగి ఆగ్రహం వ్య క్తం చేశారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను సక్రమంగా సరఫరా చేయడంలేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా రెండు రోజులలో ట్రాన్స్‌పార్మర్ల వివరాలు పూర్తి స్థాయిలో తన ముందుంచాలని విద్యుత్‌శాఖ ఏడీఈని ఆదేశించారు. రానున్న ఎనిమిది నెలల్లో మళ్ళీ రెండు సార్లు ‘గడప గడపకు కార్యక్రమం’ నిర్వహిస్తారన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ జగన్‌ రాకతో వర్షాలు బాగా కురిశాయని, పంటలు బాగా పండాయన్నారు. ఒక ఉద్యోగి నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే అది వ్యవస్థకే చెడ్డపేరు తెస్తుందని, ఉద్యోగులందరూ సక్రమంగా పనిచేయాలని అన్నారు. సిబ్బంది అహంకారాన్ని, నిర్లక్ష్యాన్ని వీడాలని, వచ్చిన పిర్యాదులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ వి.వెంకటరమణ, ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, డీఎల్‌డీవో సాయికుమార్‌, తహసీల్దారు కిరణ్‌, ఎంపీడీవో హనుమంతరావు పాల్గొన్నారు.
కందులాపురంలో గ్రామసభ
కంభం(బేస్తవారపేట),మే13: ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని పరిష్కారించడానికే పల్లె నిద్ర కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌ కుమార్‌ అన్నారు.కంపులాపురం గ్రామంలో గ్రామసభ నిర్వహించి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read more