కేతగుడిపిలో ఎంఐజీ లేఅవుట్‌ పరిశీలన

ABN , First Publish Date - 2022-05-15T04:37:33+05:30 IST

మండలంలోని కేతగుడిపి ఇలాకాలో నవోదయ విద్యాలయం పక్కనున్న స్థలాన్ని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ శనివారం పరిశీ లించారు.

కేతగుడిపిలో ఎంఐజీ లేఅవుట్‌ పరిశీలన

తర్లుపాడు, మే 14: మండలంలోని కేతగుడిపి ఇలాకాలో నవోదయ విద్యాలయం పక్కనున్న స్థలాన్ని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ శనివారం పరిశీ లించారు. 50 ఎకరాల్లో ఎంఐజీ లేఅవుట్‌కు స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. మార్కాపురం నియోజకవర్గ స్థాయిలో కేతగుడిపిలో ఎంఐజీ లేఅవుట్‌కు స్థలాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మేకలవారిపల్లె టోల్‌ ప్లాజా వద్ద జగనన్న కాలనీ లేఅవుట్‌ను కలెక్టర్‌, ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి పరిశీ లించారు. ఈ లేఅవుట్లో 126 ప్లాట్లు వేసినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలి పారు. అందులో 73 మంది లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకున్నట్లు అధికా రులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలినవారిని కూడా వెంటనే ఇళ్ల నిర్మించు కునేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సిమెంట్‌, ఇసుక, స్టీల్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని హౌసింగ్‌ డీఈ పవన్‌ కుమార్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బి.శ్రీనివాసులు, ఎంపీడీవో ఎస్‌.నరసింహులు, హౌసింగ్‌ ఏఈ నిర్మల్‌బాబు, సర్వేయర్లు, వివి ధ శాఖల అధికారులు పాల్గొన్నారు.   

ఎంఐజీ లేఅవుట్‌ పరిశీలన

గిద్దలూరు టౌన్‌, మే 14 : గిద్దలూరు పట్టణ సమీపంలో వేయనున్న ఎంఐజీ లేఅవుట్‌ను జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. నగర పంచాయతీ పరిధిలోని సర్రెడ్డిపల్లి సమీపంలో 80 ఎకరాల పరిధిలో లేఅవుట్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి భూమిని జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ మల్లికార్జుననాయుడు,  కమిషనర్‌ రామకృష్ణయ్య, సర్వేయర్‌ శ్రీనివాసరావు, వీఆర్వోలు రంగయ్య, ఫరీద ఉన్నారు. 


Read more