నవరత్నాలతో నవ బాదుడు
ABN, First Publish Date - 2022-05-15T04:35:36+05:30
వైసీపీ నవరత్నాల పేరుతో బాదుతోందని టీడీపీ మండలాధ్యక్షుడు జవ్వాజి రామాంజనేయరెడ్డి అన్నారు.
ప్రదర్శన నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు
మార్కాపురం, మే 14: వైసీపీ నవరత్నాల పేరుతో బాదుతోందని టీడీపీ మండలాధ్యక్షుడు జవ్వాజి రామాంజనేయరెడ్డి అన్నారు. మండలంలోని దరిమడుగులో టీడీపీ ఆధ్వర్యంలో శనివారం బాదుడేబాదుడు కార్యక్రమాన్ని నిర్వహించాచు. ఈ సందర్భంగా రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ ఇసుక, మద్యం, పెట్రోలు, డీజిల్, చెత్త పన్ను, ఇంటి పన్ను, సిమెంట్, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుదల, నిత్యావసరాల ధరల పెంపు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు వంటి వాటితో వైసీపీ నిజస్వరూపం బయటపడిందన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత ఉపాధ్యక్షుడు పల్లెబోయిన ఎర్రయ్య, జవ్వాజి మల్లికార్జునరెడ్డి, ముదిరెడ్డి అశోక్‌రెడ్డి, రంగారెడ్డి సుబ్బారావు, బాలరాజు ముసలయ్య పాల్గొన్నారు.