ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

లక్ష్యంతో ముందుకు సాగాలి

ABN, First Publish Date - 2022-05-14T07:04:26+05:30

విద్యార్థుల ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధన కోసం ముందుకు సాగాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు.

హాస్టల్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పల్లెనిద్రలో వసతి గృహ విద్యార్థులతో  కలెక్టర్‌ దినే్‌షకుమార్‌

కంభం ఎస్సీ హాస్టల్‌లో బస, పాఠాలు బోధన

కందులాపురంలో గ్రామసభ

కంభం (బేస్తవారపేట), మే 13: విద్యార్థుల ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధన కోసం ముందుకు సాగాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం పల్లె నిద్రలో భాగంగా ఆయన కంభంలోని ఎస్సీ హాస్టల్‌లో బసచేశారు. పిల్లలకు గంటసేటు పాఠాలు బోధించారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. పలు సూచనలు ఇచ్చారు. అంతకుముందు కందులాపురంలో సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది తో మాట్లాడారు. గ్రామంలోని రచ్చబండపై గ్రామసభ నిర్వహించారు. సచివాలయంలో పని చేస్తున్న అన్ని శాఖల సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కలెక్టర్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు సక్రమంగా ఉండాలన్నారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కంభం మండలంలోని జంగంగుంట్లలో ఘనవ్యర్థాల ప్రాంగణాన్ని పరిశీలించారు. కంభంలోని జగనన్న లేఅవుట్‌ను పరిశీలించి 45 శాతం ఇళ్ల నిర్మాణాలు ఒకస్థాయికి రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని గృహాలు ప్రారంభించకపోవడంతో లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా పూర్తిచేయించాలన్నారు. జగనన్న లేఅవుట్‌లో హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లు ఉన్నాయని, వాటిని తొలగిస్తే నిర్మాణాలు చేపడతామని లబ్ధిదారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. వెంటనే ఈ లైన్లను తొలగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి 15రోజుల్లోపల సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. కంభం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి సదుపాయాలను పరిశీలించారు. గైనకాలజిస్టు, జనరల్‌ ఫిజిషియన్‌ మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని వైద్యసిబ్బంది కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. దీంతో మార్కాపురానికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ఖాళీపోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!