-
-
Home » Andhra Pradesh » Prakasam » Man commits suicide with family quarrels-NGTS-AndhraPradesh
-
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-14T07:03:24+05:30 IST
కుటుంబ కలహాల నేపథ్యంలో మండలంలోని చినకండ్లగుంట పంచాయతీ పరిధి పోలిరెడ్డిపాలెంకు చెందిన కొత్త లక్ష్మిరెడ్డి (48) ఆత్మహత్య చేసు కున్నాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.
కొండపి, మే 13 : కుటుంబ కలహాల నేపథ్యంలో మండలంలోని చినకండ్లగుంట పంచాయతీ పరిధి పోలిరెడ్డిపాలెంకు చెందిన కొత్త లక్ష్మిరెడ్డి (48) ఆత్మహత్య చేసు కున్నాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మి రెడ్డి గురువారం సాయంత్రం పురుగుమందు తాగాడు. అనంతరం అతను వాంతులు చేసుకుంటుండటం గుర్తించిన కుటుంబసభ్యులు కొండపి పీహెచ్‌సీకి తరలించారు. అ క్కడ ప్రాథమిక అనంతరం మొరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే లక్ష్మిరెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి సో దరుడు శివరామిరెడ్డి ఫిర్యాదు మేరకు కొండపి పోలీసులు కేసు నమోదు చేశారు. మృ తదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు.

