-
-
Home » Andhra Pradesh » Prakasam » Incompetence anarchy belongs to Jagan-MRGS-AndhraPradesh
-
అసమర్థత, అరాచకం జగన్ సొంతం
ABN , First Publish Date - 2022-05-15T05:20:28+05:30 IST
సీఎం జగన్ అసమర్థత పాలన, అరాచకత్వంతో రాష్ట్రంలోని ప్రజలందరూ ఇబ్బందలుఉ పడుతున్నారని టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎంఎం కొండయ్య ధ్వజమెత్తారు.
టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎంఎం కొండయ్య ధ్వజం
చీరాల, మే 14: సీఎం జగన్ అసమర్థత పాలన, అరాచకత్వంతో రాష్ట్రంలోని ప్రజలందరూ ఇబ్బందలుఉ పడుతున్నారని టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎంఎం కొండయ్య ధ్వజమెత్తారు. పెరిగిన విద్యుత్ చార్జీలు, అప్రకటిత విద్యుత్ కోతలు, సామాన్యుని నడి విరుస్తున్న నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ లేకపోవటం, రా ష్ట్రంలో పెరుగుతున్న అఘాయిత్యాలు అందుకు నిదర్శనమని కొండ య్య చెప్పారు. స్థానిక ఎంజీసీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో శని వారం రాత్రి కొండయ్య ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ, అసమ్థ పాలనను ఎండగడుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే, ప్రతి ఒక్కరితో పరిచయ కార్య క్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరభద్ర య్య, పార్ధసారధి, పురుషోత్తం, శ్రీనివాస్, రజని, రఘనాధబాబు తదితరులు పాల్గొన్నారు.

