రైతులకు ‘అసాని’పాతం

ABN , First Publish Date - 2022-05-14T05:50:39+05:30 IST

ముండ్లమూరు మండలంలో రెండు రో జుల క్రితం కురిసిన వర్షం నువ్వు, వైట్‌బర్లీ రైతు లను కష్టాల పాల్జేసింది.

రైతులకు ‘అసాని’పాతం
తడిచిపోయిన వైట్‌బర్లీ పొగాకును ఆరబెడుతున్న రైతు

పీసీపల్లి, ముండ్లమూరు మండలాల్లో బత్తాయి, నువ్వు, వైట్‌బర్లీ రైతులకు నష్టం

ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని విన్నపం


ముండ్లమూరు, మే 13 : మండలంలో రెండు రో జుల క్రితం కురిసిన వర్షం నువ్వు, వైట్‌బర్లీ  రైతు లను కష్టాల పాల్జేసింది. సాగు చేసిన పొగాకు, నువ్వు పూర్తిగా తడిచిపోయాయి. శుక్రవారం కాస్త ఎండ కాయటంతో తడిచి పోయిన పొగాకును ఇళ్ల ముందే రైతు లు ఆరబెట్టుకున్నారు. పొలాల్లో కోచి గూళ్లు వేసిన నువ్వు పంటను సైతం తీసి ఆరబెట్టారు. నాయుడుపాలెం, త మ్మలూరు, పూరిమెట్ల, ఉమామహేశ్వర అగ్రహారంతోపాటు గంగన్నపాలెం, మా రెళ్ల గ్రామాల్లో వైట్‌బర్లీ పొగాకు తడి చిపోయింది. పసుపుగల్లు, ముండ్లమూ రు, మారెళ్ల, పూరిమెట్ల గ్రామాల్లో కూ డా నువ్వు పంటను రైతులు కోసి గూళ్లు వేయటంతో తడిసిపోయాయి. దీంత నువ్వులు మొలకెత్తటంతో రైతులు ఆ పంటను ఆరబెట్టారు. మొత్తం మీద మండలంలో రైతులకు అకాల వర్షం నష్టాన్ని మిగిల్చింది.


పీసీపల్లి, మే 13 : బత్తాయి రైతుల ఆశలపై అసాని తుఫాన్‌ నీళ్లు చల్లింది. ఈ ఏడాది బత్తాయి చెట్లకు కాపు బాగా వచ్చింది. గత ఏడాది కంటే కాయలు ఎక్కువగా కాయడంతో పాటు మార్కెట్‌లో టన్ను రూ.45నుంచి రూ.48 వేల వరకు ధర పలుకుతోంది. ఈ ఏడాది బాగా లాభాలు వస్తాయని ఆశపడిన రైతులకు అసాన్‌ తుఫాన్‌ నిరాశే మిగిల్చింది. మండలంలో కురిసిన గాలి, వర్షాలకు ఇర్లపాడు ప్రాంతంలోని పలువురు రైతుల బత్తాయి చెట్ల కొమ్మలు కాయలతో సహా విరిగిపడ్డాయి. లింగాలదిన్నె నరసింహారెడ్డి తోటలో దాదాపు 20 చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. మరికొన్ని చెట్లు తేమకు నాని కాయల బరువుకు వేర్లు బయటకు వచ్చేలా మొదళ్లతో సహా ఒరిగిపోయాయి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Read more