-
-
Home » Andhra Pradesh » Prakasam » Double hardships for the people under the YCP regime-NGTS-AndhraPradesh
-
వైసీపీ పాలనలో ప్రజలకు రెట్టింపు కష్టాలు
ABN , First Publish Date - 2022-05-14T05:47:24+05:30 IST
వైసీపీ అస్తవ్యస్త పాలనలో పేదలకు కష్టాలు రెట్టింపయ్యాయని మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు.
వెలిగండ్ల, మే 13 : వైసీపీ అస్తవ్యస్త పాలనలో పేదలకు కష్టాలు రెట్టింపయ్యాయని మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని మరపగుంట్ల పంచాయతీలో గ్రామస్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. నూనె, నిత్యావసరాలు, పెట్రోలు, అన్ని రకాల ఽధరలు పెరిగిపోయి పేదలు బతకలేని పరిస్థితి కల్పించారని చెప్పారు. మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తే రాష్టం మరో శ్రీలంకగా మారక తప్పదని హెచ్చరించారు. గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ మూడేళ్ల తర్వాత ప్రజల ముంగిటకు వస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులను, నేతలను ధరల పెంపుపై నిలదీయాలని చెప్పారు. టీడీపీ సభ్యత్య నమోదు వేగవంతం చెయాలని కార్యకర్తలకు సుచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్ రెడ్డి, కర్నాటి భాస్కర్ రెడ్డి, మెటాటి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

