726 హెక్టార్లలో పంట నష్టం

ABN , First Publish Date - 2022-05-14T07:07:05+05:30 IST

అసాని తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో రెండురోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో 726.72 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

726 హెక్టార్లలో పంట నష్టం

ప్రభుత్వానికి కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 13: అసాని తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో రెండురోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో 726.72 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ మేరకు ప్రభుత్వానికి కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ నివేదికను పంపారు. పత్తి 549.80 హెక్టార్లు, వరి 3.24 హెక్టార్లు, మినుము 84.21 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. ఈ పంటలు 1,612మంది రైతులకు చెందినవిగా గుర్తించారు. పంటనష్టం రూ.5.02కోట్ల మేర ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 


Read more