పందుల బెడదతో పంటల నష్టం
ABN , First Publish Date - 2022-11-07T22:09:38+05:30 IST
దర్శి ప్రాంతంలో పందుల బెడద తీవ్రమైంది. సాగులో ఉన్న పంటలను పందులు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాపాడాలని స్పందనలో విజ్ఞప్తి
దర్శి, నవంబరు 7 : దర్శి ప్రాంతంలో పందుల బెడద తీవ్రమైంది. సాగులో ఉన్న పంటలను పందులు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలతో పాటు వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాణ కేంద్రాలో పరిశోధనలు, విత్తనాల కోసం వేసిన వివిధ రకాల పంటలను కూడా పందులు ధ్వంసం చేస్తన్నాయి. శివరాజ్‌నగర్, సాయినగర్‌లోని పందులు పొలంలోకి చొరబడి పంటలను పీకేస్తున్నాయి. పందులను నివారించాలని టైంస్కేల్ ఉద్యోగులు సోమవారం స్పందనలో తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, నగర పంచాయతీ కమిషనర్ మంజునాథ్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.
Read more

