ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పల్లెనిద్రలో సమస్యల ఏకరువు

ABN, First Publish Date - 2022-05-15T04:34:01+05:30

గడ్డిజొన్న పెంచుకునేందుకు రూ.2500 చొప్పున వసూలు చేశారని పలువురు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

రోడ్లను పరిశీలిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ అలీ
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

గడ్డిజొన్న పెంపకానికి 

రూ.2500 వసూళ్లు

వెటర్నరీ అసిస్టెంట్‌పై గ్రామస్థుల ఫిర్యాదు 

పుల్లలచెరువు, మే 14 : గడ్డిజొన్న పెంచుకునేందుకు రూ.2500 చొప్పున వసూలు చేశారని పలువురు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా  గ్రామాల్లో రైతులు గడ్డిజొన్న పెంచుకోనేందుకు దరఖాస్తు చేసుకుంటే ముటుకుల సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్‌ తమ నుంచి రూ.2500 అక్రమంగా వసూలు చేశారని ముటుకుల ప్రజలు పల్లె నిద్రకు వచ్చిన అధికారుల వద్ద రైతులు మొరపెట్టుకున్నారు. శుక్రవారం రాత్రి ముటుకులలో గ్రామ సచివాలయంలో జిల్లా కాలుష్య నియంత్రణ అధికారి నాగిరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ విశ్వనాథ్‌రెడ్డికి రైతులు సమస్యను తెలియజేశారు. వెటర్నరీ అసిస్టెంట్‌ తాను డబ్బులు వసూలు చేయలేదని, ఉపాధి హామీ సిబ్బందికే ఆ విషయం తెలుసని తెలిపారు. ముటుకుల గ్రామంలో ఏర్పాటు చేసిన ముటుకుల ప్రాజెక్టు నుంచి  తమ గ్రామానికి చుక్క నీరు కూడా అందలేదని  తక్షణమే ముటుకుల  ప్రాజెక్టు నుంచి  నీటిని సరాఫరా చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేవవరు. ఐటివరంలో పర్యటించిన జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.శ్రీనివాసరావు, డీఎస్‌వో సురేష్‌కు  డ్రైనేజీ, ఇతర ఇబ్బందులు, రైతులకు డ్రిప్పు, వ్యవసాయ పరికరాలు, పవర్‌స్ర్పేయర్లు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. పుల్లలచెరువులో పర్యటించిన జిల్లా కోపరేటివ్‌ అధికారి రాజశేఖర్‌, బీసీ సొసైటీ  డైరెక్టర్‌ వెంకటేశ్వరరావుకు గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. జిల్లా అధికారులు సాయంత్రం సచివాలయాలు, భరోసా కేంద్రాలను పరిశీలించి సిబ్బంది తీరును తెలుసుకున్నారు. రాత్రి అఽధికారులు గ్రామాల్లో పర్యటించి రోడ్లు, డ్రేనేజీ సమస్యలను గుర్తించారు. రాత్రికి అందుబాటులో ఉన్న సచివాలయాలు, ఆర్బీకేలో నిద్రపోయారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలను గుర్తించామని నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు.

పారిశుధ్య పనులు చేపట్టాలి

జడ్పీ సీఈవో జాలిరెడ్డి  

పెద్ద దోర్నాల : గ్రామాల్లో వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలని  జిల్లా పరిషత్‌ సీఈవో జాలిరెడ్డి పంచాయతీ అధికారులను ఆదేశించారు. పల్లెనిద్రలో భాగంగా శుక్రవారం రాత్రి దోర్నాలలో పర్యటించిన సీఈవో శనివారం ఉదయం గణపతి చెక్‌పోస్టు వద్ద  జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు.  అ నంతరం ఆయన కూలీలతో మా ట్లాడారు. ఎండలు అధి కంగా ఉన్నాయని ఉదయమే పనులు ముగించుకోవాలని సూచించారు. అనం తరం అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో వ్యాపార దుకాణాలకు చెం దిన వ్యర్థాలు రోడ్డు పక్కనే ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయకుండా  డస్ట్‌ బిన్‌లలో వే యాలన్నారు. చెత్తను వెనువెంటనే డంపింగ్‌ యార్డుకు తరలించేలా చూడాలని కార్యదర్శి జిలెల్ల రామిరెడ్డికి సూచించారు. కార్యక్రమంలో ఏపీవో సాంబశివయ్య, టీఏ శ్రీనివాసరెడ్డి, ఎఫ్‌ ఏ నరేష్‌ పాల్గొన్నారు.

రోడ్లు, డ్రైనేజీలకు ప్రతిపాదనలు

మార్కాపురం : ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ షేక్‌ మస్తాన్‌ అలీ శుక్రవారం రాత్రి మండలంలోని బొందలపాడులో పల్లె నిద్ర చేశారు. అనం తరం శనివారం ఉదయం గ్రామంలోని డ్రైనే జీలు, సీసీ రోడ్లను పరిశీలించారు. గ్రామంలో 1200 మీటర్ల మేర డ్రైనేజీ, 350 మీటర్ల మేర సీసీ రోడ్లు ప్రాథమికంగా అత్య వసరమని గుర్తించారు. ఈ మేరకు  కలెక్టర్‌కు ప్రతి పాదనలు పంపిస్తామని మస్తాన్‌ వలి తెలి పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తుమ్మా వెంక టేశ్వరరెడ్డి, వైసీపీ  నాయకులు, అధికా రులు పాల్గొన్నారు.

వైపాలెంలో..

ఎర్రగొండపాలెం :  సీసీ రోడ్ల పక్కనున్న మట్టిని తొలగించి, రోడ్లపై నీరు  నిల్వలేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శిని డీపీవో నా రాయణరెడ్డి ఆదేశించారు.  వైపాలెం గ్రామపంచాయతీలో శుక్రవారం రాత్రి ఎస్టీ గురుకుల వసతి గృహంలో  పల్లెనిద్రలో డీపీవో  పాల్గొన్నారు. శనివారం ఆకస్మిక  తనిఖీలు నిర్వహించారు. ఎర్రగొండపాలెంలో ఆసిఫ్‌నగర్‌లో సీసీ రోడ్డుపై నీరు నిల్వ లేకుండా చూడాలని ఆదే శించారు. ఇంటింటికీ వెళ్లి వచ్చి చెత్తను తీసు కెళ్తున్నారా లేదా అని మహిళలను అడిగి తెలు సుకున్నారు.  వీరాయిపాలెం వద్ద జరుగుతున్న  ఉపాధి పనులను పరిశీలించారు.  కార్యక్రమంలో డీఎల్‌డీవో సాయికుమార్‌, డీఎల్‌పీవో నాగేశ్వరరావు, ఈవోపీఆర్డీ రామసుబ్బారెడ్డి, సర్పంచ్‌ అరుణాబాయ్‌,  పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. 

ఆకవీడులో సమస్యలను పరిష్కరించాలి 

రాచర్ల : ఆకవీడు గ్రామంలో సంవత్సరాల తరబడి సమస్యలు నెలకొని ఉన్నాయని, ఇప్పటికైనా పరిష్కరించాలని  గ్రామస్థులు అధికారులకు విన్నవించారు. శుక్ర, శనివారాలు పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా అధికారులు గ్రామంలో పర్యటించారు. రాచర్లలో హౌసింగ్‌ పీడీ పేరయ్య, ఈఈ  ఎన్వీ స్వామి అంగన్‌వాడీ కేంద్రాలను, తాగునీటి పథకాలు, జగనన్న కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.  అయ్యప్పస్వామి గుడి వద్ద తాగునీటి పథకం పని చేయడం లేదని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. వెంటనే పరిష్కరించారు. ఆకవీడు ఎస్సీకాలనీలో జరిగిన గ్రామసభలో అధికారులను ప్రజలు సమస్యలపై నిలదీశారు. సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మీనాయక్‌తోపాటు శ్రీనివాసరావు, అధికారులు పాల్గొనగా  డ్రైనేజీ లేకపోవడంతో నీరంతా నిలిచిఉంటుందని ఎస్సీకాలనీవాసులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే మిట్టమీదిపాలెం నుంచి మరో ఎస్సీపాలెంకు వెళ్లే రహదారికి విద్యుత్‌ స్తంభాలు మంజూరు చేసి వీధలైట్లు వేయాలన్నారు. గతంలో పని చేసిన రెవెన్యూ అధికారులు ఒకరి భూములు మరొకరికి ఆన్‌లైన్‌ చేశారని, వాటిని సరిచేసి మాకు న్యాయం చేయాలని  బాధితులు తహసీల్దార్‌ భారతీబాయిని కోరారు.  కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్‌ మస్తాన్‌వలి, ఆకవీడు సర్పంచ్‌ తలపాటి దేవదానం, తలపాటి శేఖర్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!