నల్లబెల్లం విక్రయించే దుకాణాలలో తనిఖీలు
ABN, First Publish Date - 2022-05-14T07:02:04+05:30
నల్లబెల్లం విక్రయించే దుకాణాలపై శుక్రవారం పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఒంగోలులోని బాపూజీ కాంప్లెక్స్‌లో నల్లబెల్లం విక్రయిస్తున్న మూడు దుకాణాలలో అదనపు ఎస్పీ నాగేశ్వరరా వు, ఎస్‌ఈబీ ఏఈఎస్ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి.
ముగ్గురు యజమానులకు నోటీసులు
ఒంగోలు(క్రైం), మే 13: నల్లబెల్లం విక్రయించే దుకాణాలపై శుక్రవారం పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఒంగోలులోని బాపూజీ కాంప్లెక్స్‌లో నల్లబెల్లం విక్రయిస్తున్న మూడు దుకాణాలలో అదనపు ఎస్పీ నాగేశ్వరరా వు, ఎస్‌ఈబీ ఏఈఎస్ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మకపు రిజిస్టర్లు సక్రమంగా లేవని గుర్తించి మూడు దుకాణాలకు నోటీసులు ఇ చ్చారు. అనంతరం అదనపు ఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ నాటు సారారహిత జి ల్లాగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్ల తెలిపారు. ఈ మేరకు నాటుసారాలో వినియోగించే నల్లబెల్లం నిబంధనలకు అనుగుణంగా విక్రయించాలని చెప్పారు. సారా విక్రయాలపై నిఘా పెంచామని, ఎవరైన చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఈబీ ఇన్‌స్పె క్టర్లు వంశీధర్, లత తదితరులు పాల్గొన్నారు.