-
-
Home » Andhra Pradesh » Prakasam » Buridi under the name of astrology-NGTS-AndhraPradesh
-
జ్యోతిష్యం పేరుతో బురిడి
ABN , First Publish Date - 2022-05-06T06:30:14+05:30 IST
జ్యోతిష్యం పేరుతో కాటిపాపల వేషదారణలో అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటన మండలంలోని వాకంవారిపల్లి, పలు గ్రామాల్లో జరిగింది.
పీసీపల్లి, మే 5: జ్యోతిష్యం పేరుతో కాటిపాపల వేషదారణలో అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటన మండలంలోని వాకంవారిపల్లి, పలు గ్రామాల్లో జరిగింది. వాకంవారిపల్లి గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అద్దంకి ప్రాంతానికి చెందిన కాటిపాపలుగా చెప్పుకునే కొందరు కొద్దిరోజులుగా జ్యోతిష్యం పేరుతో పీసీపల్లి మండలంలో సంచరిస్తున్నారు. గురువారం వాకంవారిపల్లి గ్రామానికి వెళ్లి అక్కడ ఓ మేకల కాపరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ‘నీకు వాహనగండం పొంచి ఉంది’ ఆ గండం గడవాలంటే తాయత్తు కట్టించుకోవాలని బురడి కొట్టించారు. కొంత నగదు ఇవ్వాలని డిమాండ్ చేసి వసూల్ చేశారు. అదే గ్రామానికి చెందిన మరో మహిళ వద్ద ఇదే విధంగా మాటలు చెప్పి మభ్యపెట్టి డబ్బులు వసూల్ చేసేందుకు ప్రయత్నించారు. ఆమె డబ్బు ఇచ్చేందుకు నిరాకరించినప్పటికీ బెదిరింపులకు దిగడంతో .వెంటనే ఆమెతో పాటు గ్రామస్థులు పీసీపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఎస్సై బి.ప్రేమ్‌కుమార్ కాటిపాపలను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఓ వ్యక్తి నుంచి వసూల్ చేసిన నగదును తిరిగి ఇప్పించారు. అనంతరం కాటిపాపలకు కౌన్సిలింగ్ ఇచ్చి మండల పరిధిలో మరోసారి సంచరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించి పంపించారు.

