ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఇళ్లు నిర్మించి తాళాలు ఇచ్చి.. సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

ABN, First Publish Date - 2022-05-14T06:56:35+05:30

‘పేదలైన తమకు ఇళ్లు నిర్మించి తాళాలు అందజే సి సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబె ట్టుకోవాలి’’ అని పలువురు మహిళలు ఎమ్మెల్యే టీజేఆర్‌.సుధాకర్‌బాబును నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తిమ్మసముద్రంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు నిలదీసిన మహిళలు 

గడపగడపకు ప్రభుత్వంలో సమస్యల వెల్లువ 


నాగులుప్పలపాడు(ఒంగోలురూరల్‌), మే13: ‘‘పేదలైన తమకు ఇళ్లు నిర్మించి తాళాలు అందజే సి సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబె ట్టుకోవాలి’’ అని పలువురు మహిళలు ఎమ్మెల్యే టీజేఆర్‌.సుధాకర్‌బాబును నిలదీశారు. గడపగడ పకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవా రం నాగులుప్పలపాడు మండలం తిమ్మసము ద్రం గ్రామంలోని తూర్పు ఎస్సీకాలనీలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సంద ర్భంగా గ్రామంలోని దేవతోటి సుందరమ్మ, బొమ్మ ల ఉషారాణి మాట్లాడుతూ తాము పేదలమని, నివేశన స్థలాలు లేవన్నారు. అయితే స్థలం ఇచ్చి గృహం నిర్మించి తాళం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకోవాలని డి మాండ్‌ చేశారు. రూప అనే మహిళ మాట్లాడు తూ తనకు దివ్యాంగుల పింఛను ఇచ్చి ఆదుకోవా లని, పలుసార్లు అర్జీలు పెట్టుకున్నా రాలేదని చె ప్పారు. అలాగే గోళ్ల శేషయ్య, తైదల సామ్రాజ్యం మాట్లాడుతూ తమ కాలనీలో మట్టిరోడ్డు కావటం తో సైడుకాలువలు లేవని, గృహాలనుంచి మురు గు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింద న్నారు. దీంతో పారిశుధ్యం లోపించి రోగాలబారిన పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కా లనీలో రోడ్లలో పెద్దపెద్ద కుంటలు కూడా ఉన్నా యని, వాటిని పూడ్చి వేయాలన్నారు. తిమ్మసము ద్రం గ్రామ పరిధిలోని మద్యందుకాణం తక్షణం తొలగించాలని,  మద్యం మత్తులో కుటుంబాలను పట్టించుకోవడం లేదని పలువురు మహిళలు ఎ మ్మెల్యేకి విన్నవించారు. ఈ సందర్భంగా సమస్య లు పరిష్కరించకుండా ఎమ్మెల్యే పర్యటించడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో మద్దిపాడు ఏఎంసీ అధ్యక్షుడు ఇనగంటి పి చ్చిరెడ్డి, మారెళ్ల బంగారుబాబు, కూనం పూర్ణచం ద్రరావు, గ్రామసర్పంచ్‌ కంచర్ల సాల్మన్‌రాజు, ఆ ర్డీవో విశ్వేశ్వరరావు, తహసీల్దార్‌ హరిబాబు, ఎం పీడీవో కె.కుసుమకుమారి, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.  


ఎంపీపీ, ఎంపీటీసీలు గైర్హాజరు


తిమ్మసముద్రం గ్రామంలో ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు నిర్వహించిన గడపగడపకు ప్రభుత్వం కా ర్యక్రమానికి ఎంపీపీ నలమలపు అంజమ్మ, మం డలంలోని పలువురు ఎంపీటీసీలు గైర్హాజరయ్యా రు. అదేవిధంగా వైసీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకుడు నలమలపు కృష్ణారెడ్డి, మండలాధ్య క్షుడు పోలినేని కోటయ్య తదితరులు రాకపోవడ ంపై పార్టీలో నెలకొన్న విభేదాలపై జోరుగా చర్చ నడిచింది.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!