ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-05-15T05:15:29+05:30

టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని కొండపి ఎమ్మెల్యే డో లా బాలవీరాంజనేయస్వామి అన్నారు.

మాట్లాడుతున్న కొండపి ఎమ్మెల్యే స్వామి, పక్కన అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి చేరవేయాలి

 కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి

అద్దంకి, మే 14: టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని కొండపి ఎమ్మెల్యే  డో లా బాలవీరాంజనేయస్వామి అన్నారు.  గ్రామస్థాయి నాయకులు ఎప్పటికప్పుడు జాబితాలను పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.  శనివారం  స్థానిక నాగులపాడు రోడ్డులోని కామేపల్లి కల్యా ణ  మండపంలో జరిగిన టీడీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయ  కమిటీ  సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ వైపల్యాలను ఇంటింటికి చేరవేసి  వచ్చే ఎన్నికలలో టీడీపీ విజయఢంకా  మోగించే విధంగా నాయకులు,  కార్యకర్తలు కృ షి చేయాలన్నారు. రోజురోజుకు  విద్యుత్‌ చార్జీలు, నిత్యావసర సరుకు ల ధరలు, ఆర్టీసీ చార్జీలు  పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారన్నా రు. సీఎం జగన్‌ ఒక చేత్తో ఇస్తూ,  మరో  చేత్తో  లాక్కుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పాదయాత్రలో జగన్‌ అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను  తప్పుదోవ పట్టించారన్నారు. ఇసుక, మద్యం,   ఇను ము ధరలు మూడు రెట్లు పెరిగాయన్నారు. మద్యం ధరలు పెంచి ఆ డబ్బులు  ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడతానని సీఎం  చెప్పటం సిగ్గు  చేటన్నారు. గతంలో మద్యం ఆదాయం రూ.6 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.20 వేల కోట్లు దోచుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభు త్వంలో పేదల జీవితాలు ఛిద్రమయ్యాయని ఎమ్మెల్యే స్వామి ఆం దోళన వ్యక్తం చేశారు.

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి  రవికుమార్‌ మాట్లాడుతూ నియోజక వర్గాన్ని 12 క్లష్టర్‌లుగా విభజించి, వాటికి ఇన్‌చార్జిలను నియమించి నట్టు చెప్పారు. క్లష్టర్‌ ఇన్‌చార్జిలు  ఎప్పటికప్పుడు యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జిలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. బూత్‌ కమిటీలు ఓటర్ల జాబితా పట్ల పూర్తి అవగాహన కలిగి  ఉండ టంతో పాటు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. మహానాడు విజయవంతానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు నాగినేని  రామకృష్ణ, బత్తుల రామకోటయ్య, మండల, పట్టణ అధ్యక్షులు కఠారి  నాగేశ్వరరావు, చిన్ని శ్రీనివాసరావు, గాడిపర్తి వెంకటరావు, కొండేటి ఇస్రాయిల్‌, రావూరి రమేష్‌, జాగర్ల మూడి  జయకృష్ణ, కరి పరమేష్‌, మస్తాన్‌వలి, కుందారపు రామారా వు, వడ్డవల్లి పూర్ణ, కాకాని అశోక్‌, స్టాలిన్‌, కరి సుబ్బారావు, ఆదిశేఖర్‌, చింతల సహదేవుడు, మలినీడి గోవిందరావు, అబ్దుల్లా, సన్నెబోయిన ఏడుకొండలు, గోవాడ శ్రీకాంత్‌, తేలప్రోలు రమేష్‌, యరమోతు  శంకరరావు, అద్దంకి అంకారావు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!