రెండో విడత రేషన్‌ లేనట్లే....

ABN , First Publish Date - 2022-05-15T05:23:14+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు ఇస్తున్న ఉచిత బియ్యం మే నెలలో కూడా లేనట్లే కనిపిస్తోంది. గత రెండు రోజుల నుంచి ప్రభుత్వం బియ్యం అలాట్‌మెంట్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో అనుమానాలు వ్యక్తమఅవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 6.80లక్షల తెల్లరేషన్‌ కార్డులు ఉండగా ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున గతేడాది నుంచి రేషన్‌ షాపుల ద్వారా కేంద్రం కోటా పంపిణీ చేస్తున్నారు.

రెండో విడత రేషన్‌ లేనట్లే....
రేషన్‌ దుకాణం

జిల్లాకు ఇంతవరకు బియ్యం కేటాయించని ప్రభుత్వం

వరుసగా రెండు నెలల నుంచి ఇదే పరిస్థితి

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 14 : కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు ఇస్తున్న ఉచిత బియ్యం మే నెలలో కూడా లేనట్లే కనిపిస్తోంది. గత రెండు రోజుల నుంచి ప్రభుత్వం బియ్యం అలాట్‌మెంట్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో అనుమానాలు వ్యక్తమఅవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 6.80లక్షల తెల్లరేషన్‌ కార్డులు ఉండగా ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున గతేడాది నుంచి రేషన్‌ షాపుల ద్వారా కేంద్రం కోటా పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ రెండు నెలల క్రితం ముగియడంతో మరో ఆరునెలలు పొడగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుని అమలుకు శ్రీకారం చుట్టింది. అయితే మార్చిలో ఉచిత బియ్యం ఇచ్చిన ప్రభుత్వం ఏప్రిల్‌లో బియ్యం అందుబాటులో లేవనే కారణంతో నిలుపుదల చేసింది. ఏప్రిల్‌, మే రెండు నెలలు కలిపి ఒకేసారి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు రేషన్‌ షాపులకు బియ్యం తరలించిన పరిస్థితి లేదు. రాష్ట్రం నగదుకు పంపిణీ చేసే మొదటి విడత పంపిణీ ప్రక్రియ ఆదివారంతో ముగియనుండగా ఈనెల 18 నుంచి రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి రాకపోవడంతో ఆ బియ్యం పంపిణీపై సందిగ్ధం నెలకొంది. గత నెలలో మాదిరిగానే ఈనెలలో కూడా ఉచిత బియ్యానికి రాష్ట్రం మంగళం పాడిందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

Read more