తహసీల్దార్‌తో పాటు సిబ్బందిని విచారించిన ఏసీబీ

ABN , First Publish Date - 2022-05-15T05:25:04+05:30 IST

అవినీతి ఆరోపణలు వచ్చిన ముండ్లమూరు తహసీల్దార్‌ కార్యాలయంపై శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. సీఎం కార్యాలయంలో జరిగే స్పందనకు తహసీల్దార్‌ పార్వతీపై పలు ఫిర్యాదులందాయి. ఈ మేరకు మెరుపు దాడి చేసిన ఏసీబీ అధికారులు రాత్రి 9వరకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అధికంగా అక్రమాలు వెలుగుచూసిన ముండ్లమూరు గ్రామ రికార్డులను తమతోపాటు ఒంగోలుకు తీసుకొచ్చారు. మొత్తం 12 పాసుపుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.

తహసీల్దార్‌తో పాటు సిబ్బందిని విచారించిన ఏసీబీ
ఒంగోలులోని ఏసీబీ కార్యాలయం

 ఒంగోలు (క్రైం), మే 14: అవినీతి ఆరోపణలు వచ్చిన ముండ్లమూరు తహసీల్దార్‌ కార్యాలయంపై శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. సీఎం కార్యాలయంలో జరిగే స్పందనకు తహసీల్దార్‌ పార్వతీపై పలు ఫిర్యాదులందాయి. ఈ మేరకు మెరుపు దాడి చేసిన ఏసీబీ అధికారులు రాత్రి 9వరకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అధికంగా అక్రమాలు వెలుగుచూసిన ముండ్లమూరు గ్రామ రికార్డులను తమతోపాటు ఒంగోలుకు తీసుకొచ్చారు. మొత్తం 12 పాసుపుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపఽథ్యంలో శనివారం తహసీల్దార్‌ పాలపర్తి పార్వతి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ స్రవంతిలతోపాటుగా కొంతమంది వీఆర్వోలను ఒంగోలులోని ఏసీబీ కార్యాలయానికి పిలిపించి విచారించారు. ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సిన పట్టాదారు పాస్‌పుస్తకాలు గత రెండేళ్లుగా కార్యాలయంలో ఉంచటంపై నిలదీశారు. అవి రైతులకు ఇవ్వకుండా ఎందుకు  కార్యాలయంలో ఉంచారని ప్రశ్నించినట్లు తెలిసింది. వారి వద్ద వాగ్మూలం తీసుకున్నట్లు ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ టి.వి.శ్రీనివాసరావు తెలిపారు. ఇంకా విచారణ పూర్తికాలేదని, అయిన అనంతరం బాధ్యులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

 

Read more