పల్లె నిద్రలో అధికారులకు సమస్యల ఏకరువు
ABN, First Publish Date - 2022-05-14T07:06:28+05:30
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా, గ్రామాల్లో అభివృద్ధి పనుల జాడ లేదని జిల్లా అధికారుల ఎదుట ప్రజలు సమస్యలను ఏకరువు పెట్టారు.
అభివృద్ధి లేక గ్రామాల్లో కుంటుపడ్డ పాలన
మూడేళ్ల నుంచి డ్రిప్ పరికరాలు ఇచ్చారా?
పుల్లలచెరువు, మే 13: వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా, గ్రామాల్లో అభివృద్ధి పనుల జాడ లేదని జిల్లా అధికారుల ఎదుట ప్రజలు సమస్యలను ఏకరువు పెట్టారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు లేక డ్రేనేజీ వ్యవస్ధ లేక వీధులు మురికి కుపాలుగా మారి దుర్వాసన, దోమలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని అధికారులను నీలదీశారు. శుక్రవారం పల్లె నిద్రలో భాగంగా పుల్లలచెరువు, ముటుకుల, ఐటి.వరం గ్రామాల్లో జిల్లా అధికారులు పర్యటించారు. ముటుకుల గ్రామంలో పర్యటించిన ఆర్డబ్యూఎస్ ఈఈ విశ్వనాథ్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ అధికారి నాగిరెడ్డిలకు ప్రజలు తాగు నీటి సమస్యలు, రోడ్ల అధ్వానంపై ప్రస్తావించారు. ముటుకుల గ్రామంలో డ్రైనేజీని పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న ప్రజలు అధికారులను నీలదీశారు. గ్రామంలో అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగళి అక్కడే వుందని తెలిపారు.ఐటివరంలో పర్యటించిన వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసరావు, డీఎ్‌సవో సురే్షలకు ప్రజలు ససమ్యలు ఏకరువు పెట్టారు. గ్రామంలో డ్రేనేజీ లేక మురుగు రోడ్లపై ప్రవహిస్తుందని గ్రామంలో మురుగుతో దుర్శాసన వచ్చి , దోమల పోటుతో రాత్రి పూట తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని అన్నారు. పింఛన్లు,రేషన్ కార్డులు లేక ఏడాది నుంచి కార్యాలయాల చూట్టూ తిరుగుతున్న ఫలితం లేదని అన్నారు. ఈ ఏడాది డిప్పు ఇస్తామని ఆయన రైతులకు తెలిపారు. పుల్లలచెరువులో పర్యటించిన జిల్లా కోపరేటీవ్ అధికారి రాజశేఖర్, బీసీ సోసైటీ డైరెక్టరు వెంకటేశ్వరరావులకు ప్రజలు సమస్యలను ఏకరువు పెట్టారు. పుల్లలచెరువు నడిబోడ్డున వున్న తాటి వీరన్న చెరువు కట్టను అక్రమించారని, గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. పల్లె నిద్రకు హాజరు కాని పీఆర్ ఏఈ నాగప్పకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కార్యక్రమంలో తహాసీల్ధారు కె దాసు, ఇన్చార్జీ ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఏవో సుధీర్‌బాబు, ఏపీవో శైలజ, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.
పెద్ద దోర్నాల : గ్రామీణ పాంతాల్లో వలంటీర్లు వారి సేవలను మరింత విస్తరించాలని జడ్పీ సీఈవో జాలిరెడ్డిపేర్కొన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం దోర్నాలలో పర్యటించారు. హసనాబాద్ గ్రామం సమీపంలో కొండబోడుపై ఏర్పాటు చేసిన జగనన్న కాలనీని సందర్శించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో పరిశీలించారు. అక్కడ ఒకరిద్దరు రోగులను పరామర్శించిన తర్వాత ఐనముక్కుల వద్ద ఉన్న రైతుభరోసా కేంద్రం, సచివాలయంలో రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభనుదేశించి ఆయన మాట్లాడారు. ప్రధానంగా తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం పనులు యుద్ధప్రాతిపదికన నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఎస్టీ వెల్ఫేర్ ఎంఫోర్మెంటు అధికారి జగన్నాధరావు పల్లెనిద్రలో భాగంగా మండలంలోని ఎగో చెర్లోపల్లి గ్రామంలో పర్యటించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో ప్రభాకర్‌శర్మ, తహసీల్దారు వేణుగోపాల్, ఎంపీపీ గుమ్మా పద్మజ, జడ్పీటీసీ లతాభాయి, దోర్నాల సర్పంచ్ చిత్తూరి హారిక, ఏపీవో సాంబశివుడు, ఏపీఎం పాండురంగప్రసాద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాచర్ల : జిల్లా ఉన్నతాధికారులు పల్లెబాట పట్టారు. మండలంలోని రాచర్ల, ఆకవీడు పంచాయతీల్లోని సచివాలయాలు, అంగన్వాడి కేంద్రాలను తనిఖీ నిర్వహించారు. రాచర్ల సచివాలయంలో హౌసింగ్ పీడీ పేరయ్య, హౌసింగ్ ఈఈ ఎం.వీ.స్వామి తనిఖీ నిర్వహించారు. ఆకవీడు సచివాలయంలో వెల్ఫేర్ డీటీ లక్ష్మీనాయక్ తనిఖీ నిర్వహించారు. కార్యక్రమాలలో ఎంపీడీవో సయ్యద్ మస్తాన్‌వలి, తహసీల్దార్ భారతీభాయి, అధికారులు పాల్గొన్నారు.
పల్లెనిద్రలో పాల్గొన్న అధికారులు
త్రిపురాంతకం : జిల్లా కలెక్టరు దినే్‌షకుమార్ ఆదేశాలతో మండలంలోని మూడు గ్రామాల్లో జిల్లా అధికారులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్బంగా త్రిపురాంతకంలో డీఆర్వో పి.శ్రీనివాసులు, దూపాడులో మత్స్యశాఖ జేడీ చంద్రశేఖరరెడ్డి, గణపవరంలో డీఆర్డీఏ పీడీ బాబూరావులు గ్రామ సభలను నిర్వహించారు. గ్రామ సమస్యలపై గ్రామస్తులతో మాట్లాడారు. వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం రాత్రికి హాస్టళ్ళలో నిద్ర చేశారు. కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కంభం చెరువును అభివృద్ది చేస్తాం : కలెక్టర్
కంభం (బేస్తవారపేట) : కంభం చెరువును జిల్లాకలెక్టర్ ఏ.ఎన్.దినే్‌షకుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కిశోర్ సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు విశిష్ఠత, స్థానిక ప్రజల నీటి అవసరాలను తీర్చే విధానం ఇరిగేషన్ అధికారుల నుంచి తెలుసుకున్నట్లు తెలిపారు. చెరువు వద్ద మౌళిక వసతులు కల్పనకు తనవంతు కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, ఎంపీడీవో నరసయ్య, తహసిల్దార్ ప్రసాద్, పాల్గొన్నారు.
మోక్షగుండంలో పల్లెనిద్ర
బేస్తవారపేట : బేస్తవారపేట మండలంలోని మోక్షగుండం గ్రామంలో శుక్రవారం సాయంత్రం పల్లెనిద్ర గ్రామసభకు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్స్కిశోర్ పాల్గొన్నారు. పూసలపాడు జగనన్న లేఅవుట్‌ను పరిశీలించి మరికొన్ని సదుపాయాలు కల్పించాలని, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, హైటెన్షన్ వయర్లు తొలగించి నీటిసౌకర్యం పూర్తిస్థాయిలో ఉండాలని సూచించారు. అనంతరం గ్రామసచివాలయాన్ని సందర్శించి సిబ్బంది పనితీరును, రికార్డులను పరిశీలించారు. గ్రామాలలో సిబ్బంది పర్యవేక్షణ పూర్తిగా ఉండాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ ముందుండాలని తెలిపారు. ఈకార్యక్రమంలో తహసిల్దార్ బి.రమాదేవి, ఎంపిడిఒ కె.కవితాచౌదరి పాల్గొన్నారు.