నారాయణ బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌

ABN , First Publish Date - 2022-05-14T08:28:02+05:30 IST

నారాయణ బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌

నారాయణ బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌

చిత్తూరు(లీగల్‌). మే 13: మాజీ మంత్రి పొంగూరు నారాయణకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ సుధాకర్‌రెడ్డి శుక్రవారం జిల్లా కోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జిల్లా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. నారాయణకు ఈ నెల 24లోపు నోటీసులు ఇవ్వాలంటూ, కేసును 9వ అదనపు జిల్లా కోర్టుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. బీమారావు బదిలీ చేశారు. ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న ఏడుగురు నిందితులకు శుక్రవారం నాలుగో అదనపు మెజిస్ర్టేట్‌ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్‌ బెయిల్‌ మంజూరు చేశారు. 


బెయిల్‌ ఇవ్వడం దురదృష్టకరం: సుధాకర్‌రెడ్డి

నారాయణను రిమాండ్‌కు పంపించకుండా బెయిల్‌ ఇవ్వడం దురదృష్టకరమని అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ సుధాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ, ‘బలవంతులు, సమాజంలో అన్నింటినీ శాసించేవారు రిమాండ్‌ కావడం లేదంటే అది దురదృష్టకరం. నారాయణ కాలేజీ చైర్మన్‌గా ఉన్నారా? లేదా? అనేది అప్రస్తుతం. వారు నేరం చేశారా? లేదా? అన్నది ముఖ్యం’ అన్నారు.


Read more