పవన్ కల్యాణ్ కర్నూల్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే...
ABN, First Publish Date - 2022-05-08T04:21:50+05:30
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ..
కర్నూలు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పవన్ ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఆళ్లగడ్డ నియోజకవర్గంకు చేరుకుంటారు. అనంతరం శిరివెళ్ళ గ్రామంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతారు. మార్గమధ్యలో ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేస్తారు. మధ్యాహ్నం 2గం.30కి శిరివెళ్ళలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు పవన్ కళ్యాణ్.