-
-
Home » Andhra Pradesh » No one was happy with Jagan rule-NGTS-AndhraPradesh
-
జగన్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు
ABN , First Publish Date - 2022-05-14T09:40:55+05:30 IST
జగన్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు
ప్రశ్నించేవారంతా టీడీపీ వారైతే.. 90శాతం మంది ప్రతిపక్షం వైపున్నట్లే : రఘురామరాజు
న్యూఢిల్లీ, మే 13(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్ పాలనలో ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరు. వారంతా తిరగబడే పరిస్థితులు నెలకొన్నాయి. మా పార్టీకి ప్రజలు ఎప్పుడో దూరమయ్యారు. ఈ విషయాన్ని గ్రహిస్తే పార్టీకి మంచిది. లేకపోతే ప్రజలకు మంచిది. సజ్జల పేర్కొన్నట్లుగా ప్రశ్నించే ప్రజలంతా టీడీపీ వారైతే నూటికి 90 శాతం మంది ప్రధాన ప్రతిపక్షం వైపే ఉన్నట్లు’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించకపోవడం, చట్టాలను పట్టించుకోకపోవడం, రాతి యుగం నాటి అధ్వానపు రోడ్లు, విద్యుత్తు సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడడం... ఇదేనా సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రవచించే రాజన్న రాజ్యం? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు తనకు అందలేదంటూ నిలదీసిన ఒక వ్యక్తికి మంత్రి అమర్‌నాథ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలకు వార్నింగ్ ఇవ్వడానికే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసిందా? విద్యా దీవెన, విద్యా వసతి బోగస్ పథకాలు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తమ వద్దకు వచ్చే అధికారులను, శాసనసభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు వీటిపై నిలదీయాలన్నారు.

