వైసీపీ, టీడీపీలతో పొత్తు సమస్యే లేదు: వీర్రాజు

ABN , First Publish Date - 2022-05-14T08:25:43+05:30 IST

వైసీపీ, టీడీపీలతో పొత్తు సమస్యే లేదు: వీర్రాజు

వైసీపీ, టీడీపీలతో పొత్తు సమస్యే లేదు: వీర్రాజు

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 13: ‘‘రాబోయే ఎన్నికల్లో జనసేన, బీజేపీ మాత్రమే కలసి పోటీ చేస్తాయి. టీడీపీ, వైసీపీ వంటి తల్లీపిల్ల పార్టీలతో పొత్తు పెట్టుకునే సమస్యే లేదు. నిధులిచ్చే బీజేపీని, జనం కోసం పనిచేసే జనసేనను గెలిపిస్తారు... ఇది తథ్యం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ, టీడీపీలు అభివృద్ధి నిరోధకులు. ఈ విషయంపై ఓపెన్‌ డిబేట్‌కు తాను సిద్ధమన్నారు.

Read more