ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నెల్లూరు జిల్లా బోగోలులో వన్యప్రాణులకు రక్షణ కరువు!

ABN, First Publish Date - 2022-05-10T03:33:43+05:30

రిజర్వు ఫారస్టులో స్వేచ్ఛగా తిరగాల్చిన వన్యప్రాణులకు ఆహారం, నీరు కరువై జనారణ్యంలోకి వచ్చి కుక్కల దాడిలో కొన్ని గాయపడుతుండగా, కొన్ని మృతి చెందుతున్నాయి.

1బిటిటిఆర్‌9. కుక్కల దాడికి గురైన చుక్కల దుప్పి (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నీరు, ఆహారం కోసం జనారణ్యంలోకి..

కుక్కల దాడిలో గాయపడి మృతి చెందుతున్న వైనం

బిట్రగుంట, మే 9: రిజర్వు ఫారస్టులో స్వేచ్ఛగా తిరగాల్చిన వన్యప్రాణులకు ఆహారం, నీరు కరువై జనారణ్యంలోకి వచ్చి కుక్కల దాడిలో కొన్ని గాయపడుతుండగా, కొన్ని మృతి చెందుతున్నాయి. దీంతో వన్యప్రాణలకు రక్షణ కరువైన పరిస్థితి వెలుగు చూస్తోంది. బోగోలు మండలానికి పడమర, దక్షిణ శివారు ప్రాంతాల్లో ఉండే అడవులు కనుమరుగైపోయాయి. అటవీ శాఖ వారు అడవులను నరికి జామాయల్‌, వెదురు, నేరేడు, ఎర్రచందనం వంటి మొక్కలను నాటడంతో వన్యప్రాణుల నివాసాలు లేకుండా పోయాయి. అడవుల్లో జనసంచారం పెరగడంతో మూగజీవులు తల దాచుకొనేందుకు ఇబ్బంది ఏర్పడింది. వాగులు, వంకలు, గుంటలు పూడిపోవడంతో తాగేందుకు నీరు దొకరడం కూడా కష్టమైంది. బిట్రగుంట, రాచర్లపాడు రిజర్వు ఫారెస్టులో వందల సంఖ్యలో వన్యప్రాణలు ఉన్నాయి. వీటి సంరక్షణ విషయాన్ని అధికారులు గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈక్రమంలో వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం ప్రత్యేక అడవుల్లో నీటి గుంటలను ఏర్పాటు చేయించాల్సిన అవసరం ఎతైనా ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!