దేవమ్మచెరువులో బాదుడే బాదుడు
ABN, First Publish Date - 2022-05-15T03:49:37+05:30
మండలంలోని దేవమ్మచెరువు పంచాయతీలో శనివారం సాయంత్రం మండల టీడీపీ అధ్యక్షుడు కప్పా ప్రభాకర్‌రాజు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.
సీతారామపురం, మే 14 : మండలంలోని దేవమ్మచెరువు పంచాయతీలో శనివారం సాయంత్రం మండల టీడీపీ అధ్యక్షుడు కప్పా ప్రభాకర్‌రాజు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన విద్యుత్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇంటింటికీ అగ్గిపెట్టె, కొవ్వొత్తితోపాటు, కరపత్రాలను పంపిణీ చేసి జగన్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలపై గ్రామస్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భూమయ్యగారి శ్రీనివాసులు, పెద్దగౌస్, రమేష్, మహాలక్ష్మయ్య, విజయ్, శ్రీనివాసులు, కిరణ్, రాజేష్, జయరాములు, వినోద్‌ఖన్నా, ఆనంద్, జీవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.