ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మూగ జీవాలకు వింత వ్యాధి!

ABN, First Publish Date - 2022-05-15T03:52:38+05:30

మూగ జీవాలకు వింత వ్యాధి వ్యాపిస్తోంది. రెండు రోజుల్లో సుమారు 60కి పైగా జీవాలు మృతి చెందడంతో వాటి పోషకులకు దాదాపు రూ.4 లక్షల నష్టం వాటిల్లింది.

మృతిచెందిన మూగజీవాలు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

2 రోజుల్లో 60కి పైగా మృతి

రూ.4 లక్షల నష్టం

పత్తాలేని పశు వైద్యులు

లబోదిబోమంటున్న యజమానులు

ఉదయగిరి, మే 14: మూగ జీవాలకు వింత వ్యాధి వ్యాపిస్తోంది. రెండు రోజుల్లో సుమారు 60కి పైగా జీవాలు మృతి చెందడంతో వాటి పోషకులకు దాదాపు రూ.4 లక్షల నష్టం వాటిల్లింది. ఇంత జరుగుతున్నా సంబంధిత పశు వైద్యులు పత్తాలేరు. దీంతో మూగజీవాల పోషకులు లబోదిబోమంటున్నారు. ఉదయగిరి మండలంలో అధిక మంది గొర్రెలు మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో ప్రధానంగా కృష్ణంపల్లి గ్రామంలో బొందికాళ్ల బాలయ్యకు 300, మాలకొండయ్యకు 300, జెట్టివారిపల్లికి చెందిన గడ్డం సుధాకర్‌కు 200 జీవాలు ఉన్నాయి. ఈ క్రమంలో రెండు మూడు రోజుల నుంచి జీవాల ముక్కుల నుంచి నీరు కారడం, పారడం, మేతమేయకపోవడం, దగ్గడం తదితర లక్షణాలతో మృత్యువాత పడుతున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత పశు వైద్యులకు చెప్పి చికిత్స అందించేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో మందుల దుకాణాలకు వెళ్లి జీవాలకు వ్యాపించిన వ్యాధి లక్షణాలను చెప్పి వేలాది రూపాయలు వెచ్చించి వారిచ్చిన పుర్రురోగం, దొమ్మజబ్బు, నట్టల మందులు వాడినా ప్రయోజనం లేకుండా జీవాలు చనిపోతున్నాయని వాపోతున్నారు. ఇలా రెండు రోజుల్లోనే మాలకొండయ్య, బాలయ్యకు చెందిన 50, సుధాకర్‌కు చెందిన 10 జీవాలు మృత్యువాతపడ్డాయి. ఇకెన్ని మృత్యువాత పడుతాయోనని బాధిత జీవాల పోషకులు ఆందోళన చెందుతున్నారు. 


భయమేస్తుంది

జీవాలకు ఎన్ని మందులు వాడినా జబ్బు నయం కాకుంండా మృతి చెందుతున్నాయి. ఇంకా జీవాలు జబ్బు బారిన పడుతూనే ఉన్నాయి. దీంతో భయమేస్తుంది.

- బొందికాళ్ల బాలయ్య

 

అధికారులు స్పందించాలి

వింత వ్యాధితో జీవాల మృతి చెందుతున్నాయి. అధికారులు స్పందించి జీవాలను కాపాడాలి. లక్షలాది రూపాయలు నష్టపోయాం. ప్రభుత్వమే ఆదుకోవాలి. 

- బొందికాళ్ల మాలకొండయ్య


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!