-
-
Home » Andhra Pradesh » Nellore » road accident at alluru mandal-MRGS-AndhraPradesh
-
లారీ చక్రాల కింద పడి యుడకుడి మృతి
ABN , First Publish Date - 2022-05-15T03:55:22+05:30 IST
మండలంలోని పడమర గోగులపల్లిలో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు లారీ వెనుక చక్రాల కింద పడి మత్స్యకార యువకుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
మరొకరికి గాయాలు
అల్లూరు, మే 14 : మండలంలోని పడమర గోగులపల్లిలో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు లారీ వెనుక చక్రాల కింద పడి మత్స్యకార యువకుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఇస్కపల్లి పంచాయతీ చంద్రబాబునగర్కు చెందిన కాటంగారి శీను (22), మరో యువకుడు రాజ్కుమార్తో కలిసి ద్విచక్ర వాహనంపై గోగులపల్లి మీదుగా విడవలూరు మండలానికి బయలుదేరి వెళుతూ మార్గమధ్యంలో పడమర గోగులపల్లి సెంటరులో ధాన్యం లోడుతో అల్లూరు వైపునకు వెళుతున్న లారీని దాటే క్రమంలో మోటారు సైకిల్ అదుపుతప్పి పడడంతో వెనుక కూర్చుని ఉన్న శీను లారీ వెనుక చక్రాల మధ్యన పడడం, చక్రాలు ఆ యువకుడిపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న యువకుడు ఎడమ వైపునకు పడిపోవడంతో గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని 108 వాహనంలో అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలికి తరలించారు. ఇద్దరు యువకులు మద్యం సేవించి ఉండి వాహనాన్ని అదుపు చేయలేకపోడం ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. చేతికందిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంతో వారి రోదన స్థానికులను కలచివేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

